Health Tips: గ్యాస్ నొప్పితో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం..
ఉరుకులు పరుగుల జీవితం.. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తినడం.. ఇవన్నీ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో కడుపు సమస్యలు సర్వసాధరణంగా మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో గ్యాస్, ఎసిడిటీ సమస్య చాలా సాధారణమైపోయాయి.
ఉరుకులు పరుగుల జీవితం.. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తినడం.. ఇవన్నీ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో కడుపు సమస్యలు సర్వసాధరణంగా మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో గ్యాస్, ఎసిడిటీ సమస్య చాలా సాధారణమైపోయాయి. సాధారణంగా ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. దానిని ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రమే ఈ సమస్యను అర్థం చేసుకోగలరు. అసిడిటీ సమస్య, అనుభవించని వారికి సాధారణం.. దానితో బాధపడే వ్యక్తికి చాలా బాధాకరమైనదిగా ఉంటుంది. వేపుడు, మసాలా, కారం ఆహారాన్ని తినడం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల అసిడిటీ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీని కారణంగా వ్యక్తి కడుపు లేదా తలనొప్పి, కడుపులో మంట వంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ మాత్రలు వేసుకోవడం మంచిది కాదు.. అలా అని తీసుకోకుండా ఉండలేదు.. అయితే, సాధ్యమైనంత మేరకు గ్యాస్ సమస్యను నయం చేయడానికి ఇంటి నివారణ చిట్కాలను అవలంభించవచ్చు. మన వంటింట్లో ఉండే.. అనేక రకాల పానీయాలు ఎసిడిటీ, గ్యాస్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
ఎసిడిటీ, గ్యాస్ నొప్పికి నివారణ చిట్కాలు..
చల్లని పాలు: ఎసిడిటీ సమస్య ఉంటే చల్లని పాలు తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎసిడిటీ సమస్య వస్తే అందులో పంచదార లేదా ఉప్పు లాంటి.. ఎలాంటి పౌడర్ వేయకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
వాము నీరు: వాము నీటిని తాగడం ద్వారా మీరు ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 1 కప్పు సాధారణ నీటిలో అర చెంచా వాము గింజలను వేసి తాగడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.
నిమ్మ రసం – సోడా: ఎసిడిటీ సమస్య వస్తే నిమ్మరసం, బ్లాక్ సాల్ట్, సోడా కలిపిన నీటిని తాగితే ఎసిడిటీ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.
ఇంగువ: యాసిడ్ ప్రభావాలను తగ్గించడానికి ఇంగువ కూడా మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఇది జీర్ణవ్యవస్థను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల మీరు ఇంగువ నీటిని కూడా తాగవచ్చు. అసిడిటీ సమస్య ఉన్నవారు, కూరను వండేటప్పుడు ఇంగువ జోడించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మజ్జిగ: గ్యాస్ సమస్య వస్తే మజ్జిగ కూడా తాగవచ్చు. దీన్ని తాగడం వల్ల కడుపులో మంట నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇంట్లోనే మజ్జిగ తయారు చేసుకొని తాగితే మేలు జరుగుతుంది.
కానీ అలాంటి ఇంటి నివారణలను ప్రయత్నించే ముందు, ఖచ్చితంగా డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించడం మేలు ఎందుకంటే.. కొన్ని సార్లు కడుపు నొప్పి.. గ్యాస్ సమస్య కాకపోవచ్చు.. మరేదైనా సమస్య అయి ఉండచ్చు.. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..