Health News: ధూమపానం, మద్యానికి బదులు వాటి వైపు ఆకర్షితులవుతున్న యువత.. ఆరోగ్యానికి ప్రమాదం అంటున్న నిపుణులు..

మద్యపానం, ధూమపానం బదులు యువత గంజాయి, మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల కాలంలో గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం భారీగా పెరిగిందని, వీటిని తీసుకుంటున్నవారిలో యువత అధిక శాతం..

Health News: ధూమపానం, మద్యానికి బదులు వాటి వైపు ఆకర్షితులవుతున్న యువత.. ఆరోగ్యానికి ప్రమాదం అంటున్న నిపుణులు..
Youth addicted Vaping
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 19, 2022 | 4:18 PM

నేటి ఆధునిక కాలంలో యువత వ్యసనాలకు త్వరగా అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా కాలేజీ స్థాయిలోనే చాలా మంది ధూమపానానికి, మద్యపానానికి అలవాటుపడుతున్నారు. గతంలో పెద్ద వయస్కుల వారు, ఏదైనా రోజంతా శారీరక శ్రమ చేసిన కార్మికులు రోజూ మద్యం తాగేవారు. రానూరాను పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. పార్టీల సమయంలో అందరూ ఎంతో కొంత మద్యం తీసుకోవడం సాధారణ విషయంగా మారింది. కొంతమంది మద్యానికి బానిసలువుతుంటే.. మరికొందరు పరిమితులకు లోబడి ధూమపానం చేయడంతో పాటు మద్యం తీసుకుంటుంటారు. అయితే ఇటీవల కాలంలో ధూమపానం, మద్యం తీసుకునే యువత సంఖ్య తగ్గుతోంది. అయితే క్రమంగా ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మద్యపానం, ధూమపానం బదులు యువత గంజాయి, మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల కాలంలో గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం భారీగా పెరిగిందని, వీటిని తీసుకుంటున్నవారిలో యువత అధిక శాతం ఉన్నారని తాజా అధ్యయన్ ఒకటి వెల్లడిస్తోంది. అదే అమెరికాలో అయితే గంజాయి, ఎలక్ట్రానిక్ సిగరెట్ వాడకం బాగా పెరిగిందని తాజా పరిశోధన ఒకటి తెలిపింది. పొగాకు, మద్యం వాడకం కాలక్రమేణా క్షీణించినప్పటికీ, గంజాయి, మాదక ద్రవ్యాలు, ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకం పెరిగిందని, ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో యువత ఎలక్ట్రానిక్ సిగరెట్లు వాడకాన్ని ఓ ట్రెండ్ గా భావిస్తున్నారని, దీంతో గత మూడేళ్లలో దీని వాడకం బాగా పెరిగినట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చెప్పారు. తాము మాదకద్రవ్యం నికోటిన్‌ను తీసుకుంటామని చెప్పిన వారి శాతం గత మూడేళ్లలో 7% నుండి 17%కి పెరిగిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గంజాయి తీసుకుంటున్న వారి శాతాన్ని పరిశీలిస్తే 3% నుండి దాదాపు 10% వరకు పెరిగింది. యువత పొగాకు, ఆల్కహాల్ కు భిన్నంగా గంజాయి, మాదక ద్రవ్యాలను తీసుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. యువత అంతా ఒకే మోతాదులో వీటిని తీసుకోవడం లేదని, వారు కాలేజీ బయట గడిపే సమయంపై వారు తీసుకునే మోతాదు ఆధారపడి ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. క్రీడల్లో పాల్గొనే యువత కూడా ఇటీవల కాలంలో డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని అధ్యయనం వెల్లడించింది. అమెరికాలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల తయారీ కంపెనీలు వాటిలో రుచులను, ఫ్లేవర్ లను జోడించి, యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని కొందరు పరిశోధకులు తెలిపారు.

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని, అయితే వాటి బదులు గంజాయి, మాదకద్రవ్యాలు తీసుకోవడం మరింత ప్రమాదకరమని, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభిస్తే వాటికి బానిసలుగా మారతారని, కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ లభించని సమయంలో వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..