AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Osteoporosis Day: ఆస్టియోపోరోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా మారుతారు.. ఈ వ్యాధి నుంచి ఎలా జయించాలంటే..

ఆస్టియోపోరోసిస్‌ ఈ పేరు చెబితో బహుశా అందరికీ తెలియకపోవచ్చు కానీ.. ఎముకలు గుల్ల బారడం అంటే అందిరికీ తెలిసే ఉంటుంది. ఎముకల్లో చేవ తగ్గిపోయి, ధృఢత్వం కోల్పోయి, బోలుగా మారుతాయి. దీనికి ఆస్టియోపోరోసిస్‌గా పిలుస్తారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా..

World Osteoporosis Day: ఆస్టియోపోరోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా మారుతారు.. ఈ వ్యాధి నుంచి ఎలా జయించాలంటే..
World Osteoporosis Day
Narender Vaitla
|

Updated on: Oct 21, 2022 | 6:10 AM

Share

ఆస్టియోపోరోసిస్‌ ఈ పేరు చెబితో బహుశా అందరికీ తెలియకపోవచ్చు కానీ.. ఎముకలు గుల్ల బారడం అంటే అందిరికీ తెలిసే ఉంటుంది. ఎముకల్లో చేవ తగ్గిపోయి, ధృఢత్వం కోల్పోయి, బోలుగా మారుతాయి. దీనికి ఆస్టియోపోరోసిస్‌గా పిలుస్తారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం వికలాంగులుగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకుగాను ప్రతీ ఏటా అక్టోబర్‌ 20వ తేదీన ప్రపంచ ఆస్టియోపోరోసిస్‌ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య లక్ష్యం. ఇంతకీ ఈ వ్యాధి ఎలా వస్తుంది.? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.? దీనిని జయించాలంటే ఏం చేయాలి.? లాంటి పూర్తి వివరాలను ఫరీదాబాద్‌లోని అకార్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ & స్పోర్ట్స్ నిపుణుడు డాక్టర్‌ యువరాజ్‌ కుమార్‌ తెలిపారు. వారి మాటల్లోనే..

ఈ వ్యాధి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా అటాక్‌ చేస్తుంది. 50 ఏళ్లు పైబడిన ప్రతీ ముగ్గురిలో ఒకరు, ప్రతీ 5గురు పురుషుల్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎముకలు ధృడత్వాన్ని కోల్పోవడంతో పాటు ఎదగవు. ఇక ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి బారిన పడిన వారికి ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. వ్యాధి తీవ్ర పెరిగి ఎదైనా ఎముక విరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వయసుతో పాటు సంక్రమించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతోనే ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చు.

ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, ముందస్తు లక్షణాలు కనిపించకపోవడంతో కేవలం 20 శాతం మంది మాత్రమే ప్రతీ ఏటా ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. మోనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తల ద్వారా ఈ వ్యాధి దరి చేరకుండా చూడొచ్చు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటంటే..

ఇవి కూడా చదవండి

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

* తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్‌ డి, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

* మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

* కుటుంబంలో ఇంతకు ముందు ఎవరికైనా ఈ వ్యాధి సోకితే పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ మొదట్లోనే వ్యాధిని గుర్తిస్తే జయించడం చాలా సులువు.

* వైద్యుల సూచన మేరకు జీవన విధానంలో, తీసుకునే ఆహారం విషయంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల వ్యాధిని జయించవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..