World Bicycle Day 2022: సైకిల్‌ తొక్కడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే బైక్‌ వదిలేస్తారు..!

World Bicycle Day 2022: సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లవుతుంది. పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఒక మంచి మార్గం. ఇది సైక్లింగ్‌

World Bicycle Day 2022: సైకిల్‌ తొక్కడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే బైక్‌ వదిలేస్తారు..!
World Bicycle Day 2022
Follow us

|

Updated on: Jun 02, 2022 | 8:36 PM

World Bicycle Day 2022: సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లవుతుంది. పర్యావరణాన్ని కాపాడటానికి సైక్లింగ్ ఒక మంచి మార్గం. ఇది సైక్లింగ్‌ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా కండరాలను బలోపేతం చేస్తుంది. జూన్ 3, 2018 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ న్యూయార్క్‌లో మొదటిసారిగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సైకిల్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈసారి జూన్ 3న ఐదో ప్రపంచ సైకిల్ దినోత్సవం వస్తోంది. సైకిళ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ రోజు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు అన్ని ప్రాంతాల్లో సైకిళ్లపై ర్యాలీలు తీస్తారు.సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. మధుమేహం కంట్రోల్‌

డయాబెటిస్ సమస్యలు ఉన్నవారికి శారీరక వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి. రోజూ దాదాపు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలు తగ్గుతాయి.

3. బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి వ్యాయామం. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ ఒక గంట సైక్లింగ్ చేయడం వల్ల దాదాపు 300 కేలరీలు బర్న్ అవుతాయి. ఇది కాకుండా బెల్లీ ఫ్యాట్‌ని కరిగిస్తుంది.

4. ఒత్తిడిని తగ్గిస్తుంది

సైక్లింగ్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతే కాకుండా సైకిల్ తొక్కే వారికి మంచి నిద్ర పడుతుంది. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి కోపం, నిరాశ వంటి అన్ని సమస్యల నుంచి బయటపడుతాడు.

5. ఊపిరితిత్తులు బలోపేతం

సైక్లింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది. వాస్తవానికి సైకిల్ తొక్కేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. దీంతో ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి