Smoking Effect: పొగతాగేవారికి హెచ్చరిక.. మీరు ఈ ప్రమాదంలో ఉన్నట్లే..!

Smoking Effect:ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ధూమపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణం. దీని కారణంగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా పెరుగుతున్నాయి.

Smoking Effect: పొగతాగేవారికి హెచ్చరిక.. మీరు ఈ ప్రమాదంలో ఉన్నట్లే..!
Smoking Effect
Follow us

|

Updated on: Jun 03, 2022 | 6:15 AM

Smoking Effect:ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ధూమపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణం. దీని కారణంగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా పెరుగుతున్నాయి. పొగతాగడం వల్ల కేన్సర్ మాత్రమే కాదు మరెన్నో తీవ్రమైన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది గుండె, మెదడును బాగా దెబ్బతీస్తుంది. ధూమపానం వల్ల ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు.

బ్రెయిన్ స్ట్రోక్

ధూమపానం మెదడు వాల్యూమ్‌ను తగ్గిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువసేపు ధూమపానం చేస్తే అతని శరీరంలోని ముఖ్యమైన కణజాలం తగ్గిపోతుంది. దీని కారణంగా మెదడు పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా డిమెన్షియా వచ్చి జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. డాక్టర్ ప్రకారం ధూమపానం వల్ల స్ట్రోక్ వస్తుంది. ఎవరైనా రోజుకు 20 సిగరెట్లు తాగితే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. అందుకే ధూమపానం మానేయడానికి ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

మధుమేహం

ధూమపానం వల్ల దంత వ్యాధులు కూడా వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది ఆస్తమా అటాక్‌కి కూడా దారి తీస్తుంది. గర్భిణీలు ధూమపానం చేస్తే అది బిడ్డకి కూడా ప్రమాదం. ధూమపానం మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. రోజూ వ్యాయామం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును దూరం చేసుకోవచ్చు. ఎక్కువగా పొగతాగే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా సీటీ స్కాన్ చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. సాధారణ ఈఎన్ టీ చెవి, ముక్కు, గొంతు పరీక్షతో కూడా క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం