Health Tips: 40 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్.. ఈ విటమిన్లు లేకపోతే ఇబ్బందులు తప్పవు..!
Health Tips: వృద్ధాప్యంతో, శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా అవసరం. ముఖ్యంగా స్త్రీల శరీరంలో 40 ఏళ్ల తర్వాత అనేక పోషకాల కొరత ఏర్పడుతుంది.
Health Tips: వృద్ధాప్యంతో, శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా అవసరం. ముఖ్యంగా స్త్రీల శరీరంలో 40 ఏళ్ల తర్వాత అనేక పోషకాల కొరత ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కారణం మహిళల ఆహారం, డ్రింక్స్‌లో తీసుకునే అజాగ్రత్త, శారీరక మార్పులు. పిల్లలను కనడం, హార్మోన్లలో అనేక మార్పుల కారణంగా.. స్త్రీలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. 40 ఏళ్ల తర్వాత మహిళలు తప్పనిసరిగా పోషకాలు, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఏ విటమిన్లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1 విటమిన్ డి: వయసు పెరిగే కొద్దీ స్త్రీలు ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ పరిస్థితిలో, మహిళలు విటమిన్ డి మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. పాలు, చీజ్, పుట్టగొడుగులు, సోయా, వెన్న, ఓట్ మీల్, కొవ్వు చేపలు, గుడ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
2 విటమిన్ సి: మహిళలు తమ ఆహారం పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉంటారు. దీని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. 40 ఏళ్ల తర్వాత ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకోసం నిమ్మ, నారింజ, పచ్చి కూరగాయలు, ఉసిరి వంటి వాటిని తినాలి.
3. విటమిన్ ఇ: పెరుగుతున్న వయస్సు కొన్నిసార్లు మహిళల ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఆ పరిస్థితిలో మహిళలు విటమిన్ ఇ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. విటమిన్ ఇ మీ చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ముడతలు, మచ్చల సమస్యను కూడా తొలగిస్తుంది. విటమిన్ ఇ కోసం బాదం, వేరుశెనగ, వెన్న, పాలకూర తినొచ్చు.
4. విటమిన్ ఎ: స్త్రీలు 40-45 సంవత్సరాలలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. కొన్నిసార్లు దాని ప్రభావం ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో మహిళలు విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ ఎ కోసం క్యారెట్, బొప్పాయి, గుమ్మడి గింజలు, పాలకూర తినవచ్చు.
5 విటమిన్ బి: మహిళలు 40 ఏళ్ల వయసులో విటమిన్ బి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గర్భధారణ సమయంలో మహిళలకు విటమిన్ B9 చాలా ముఖ్యం. దీని కోసం.. బీన్స్, ధాన్యాలు, ఈస్ట్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..