AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart attack: గుండెపోటు వస్తే పురుషుల కన్నా మహిళలకే మరణించే చాన్స్ ఎక్కువ.. సంచలన అధ్యయనం..!

మహిళలు సున్నితమైన మనసు కలవారు చాలామంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం దీన్ని కొట్టి పారేస్తూ ఉంటారు.

Heart attack: గుండెపోటు వస్తే పురుషుల కన్నా మహిళలకే మరణించే చాన్స్ ఎక్కువ.. సంచలన అధ్యయనం..!
Heart Attack
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: May 31, 2023 | 10:45 AM

Share

మహిళలు సున్నితమైన మనసు కలవారు చాలామంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం దీన్ని కొట్టి పారేస్తూ ఉంటారు. మహిళలు దృఢమైన మనసు కలవాలని చెబుతూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇటీవల ఓ అధ్యయనంలో గుండెపోటుకు గురైన వారిలో అత్యధికంగా మహిళలే చనిపోతున్నారని తేలింది. దీనికి సంబంధించిన అనేక కారణాలను ఆ అధ్యయనం వెలువరించింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషుల కంటే గుండెపోటు తర్వాత మహిళలు చనిపోయే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెలువడింది. ఇది సంచలనంగా మారింది. ఈ కొత్త అధ్యయనం ప్రకారం పురుషుల కంటే గుండెపోటు తర్వాత మహిళలే ఎక్కువగా ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని తేల్చింది. ఈ అధ్యయనం ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ, సైంటిఫిక్ కాంగ్రెస్ ESC అక్యూట్ కార్డియోవాస్కులర్ కేర్ లో పేర్కొన్నారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ యూనివర్శిటీ హాస్పిటల్ నుండి అధ్యయన రచయిత్రి డాక్టర్ సారా హోల్లె ప్రకారం, తమ అధ్యయనంలో స్త్రీలు, పురుషులు గుండెపోటు తర్వాత కార్డియోజెనిక్ షాక్‌కు సంబంధించిన క్లినికల్ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉన్నారని తెలిపారు.

కార్డియోజెనిక్ షాక్ అనేది గుండె వివిధ అవయవాలకు రక్తాన్ని సరిగ్గా ప్రసారం చేయలేని పరిస్థితి. అధ్యయనంలో 2010, 2017 మధ్య డెన్మార్క్ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి కార్డియోజెనిక్ షాక్ కేర్‌ను అందించే రెండు అత్యంత ప్రత్యేక కేంద్రాలలో రోగి లక్షణాలు, చికిత్స, 30-రోజుల మరణాల డేటా వైద్య రికార్డుల నుండి సంగ్రహించారు. డానిష్ నేషనల్ పేషెంట్స్ రిజిస్ట్రీ నుండి దీర్ఘకాలిక మరణాల డేటా పొందబడింది.

ఇవి కూడా చదవండి

కేస్ స్టడీ:

ఈ సమయంలో, కార్డియోజెనిక్ షాక్‌తో బాధపడుతున్న మొత్తం 1716 మంది రోగుల డేటా విశ్లేషించారు, అందులో 438 మంది అంటే 26% మంది మహిళలు ఉన్నారు. గుండెపోటు వచ్చిన 30 రోజుల తర్వాత 50 శాతం మంది పురుషులు బతికి బయటపడ్డారని, 38 శాతం మంది మహిళలు బయటపడ్డారని తేలింది. ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత, 27% మంది మహిళలు జీవించి ఉండగా, 39% మంది పురుషులు జీవించి ఉన్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే:

డాక్టర్ హోల్ ఇలా అన్నారు, “పురుషుల కంటే తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, దగ్గు, అలసట, వెన్ను, దవడ లేదా వెన్ను నొప్పితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని రుజువులతో సహా పేర్కొన్నారు. మెడ నొప్పి వంటి నాన్-స్పెసిఫిక్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తమ అధ్యయనంలో పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు మొదట్లో స్పెషలిస్ట్ ఆసుపత్రిలో కాకుండా స్థానిక ఆసుపత్రిలో చేరడం కూడా ఒక కారణం కావచ్చని పేర్కొన్నారు.

అలాగే మహిళల్లో ఒత్తిడి కూడా ఒక కారణంగా చెబుతూ, ముఖ్యంగా కుటుంబంలో మహిళలు పోషించే పాత్ర కీలకంగా ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే, గుండెపోటుకు కారణం అవుతుందని మానసిక శాస్త్రవేత్తలు చదువుతున్నారు. అందుకే మహిళలు తరచూ ఎప్పటికప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలని, రక్తపోటు విషయంలో ఏమాత్రం తేడాలు వచ్చినా వైద్యుల సలహా పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్యసంబంధిత వార్తల కోసం