AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Healthy Tips: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి!

ప్రస్తుతం గుండె జబ్బుల సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకు కారణం జీవనశైలిలో మార్పులు. చాలా మందికి గుండె జబ్బులపై అవగాహన లేకపోవడం, తీసుకునే ఆహారం గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం..

Heart Healthy Tips: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి!
Heart Healthy Tips
Subhash Goud
|

Updated on: May 31, 2023 | 5:40 AM

Share

ప్రస్తుతం గుండె జబ్బుల సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకు కారణం జీవనశైలిలో మార్పులు. చాలా మందికి గుండె జబ్బులపై అవగాహన లేకపోవడం, తీసుకునే ఆహారం గురించి పెద్దగా పట్టించుకోకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, దంత, తదితర వ్యాధులు గుండెజబ్బులకు దారితీస్తాయి.

అస్థిరంగా రొమ్మునొప్పి, రక్తపోటు అధికమవటం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే వైద్యున్ని సంప్రదించాలి. కేవలం పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. గుండె వ్యాధులు రావ‌డం, వాటి కార‌ణాలు, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. అయితే వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ సభ్యులు నాలుగు ప్రధాన ప్రమాద కారకాల నియంత్రించడం ద్వారా కనీసం 80 శాతం అకాల మరణాలను తగ్గించవచ్చని పేర్కొంది. ఆ నాలుగు ప్రమాద కారకాలు ఇవే.

1. పొగాకు వినియోగం 2. అనారోగ్యకరమైన ఆహారం 3. శారీరక స్తబ్దత 4. మద్యం వినియోగం

ఇవి కూడా చదవండి
  1. ఇవి తింటే మీ గుండె ఆరోగ్యం: దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  2. గుండె ఆరోగ్యానికి ఆకు కూరలు: ఆకు కూరలు గుండెకు ఎంతో మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద, ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి. రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.
  3. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌: ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్‌ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్‌ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్‌, ఐరన్‌, ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్‌, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
  4. చేపలతో గుండె జబ్బులకు చెక్: సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.