Healthy Liver: మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలా..? అద్భుతమైన ఆహారాలు ఇవే..!

మన శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం జీవించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేసేలా చూడాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే..

Healthy Liver: మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలా..? అద్భుతమైన ఆహారాలు ఇవే..!
Healthy Liver
Follow us

|

Updated on: May 30, 2023 | 8:19 AM

మన శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం జీవించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేసేలా చూడాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఇక మన శరీరంలో కీలక పాత్ర పోషించేది కాలేయం. దీనిని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎంతో మంచిది. ఇది క్షీణిస్తే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వైద్యులు కూడా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని పదేపదే సూచిస్తుంటారు. కాలేయం సరిగ్గా పని చేయకపోతే పనిచేయకపోతే జీర్ణక్రియ సమస్యలతో పాటు టైప్ 2 డయాబెటిస్‌తో పాటు మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.

ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు

ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, చిప్స్ వంటి ప్యాక్డ్ స్నాక్స్, గింజలలో కూడా కొవ్వులు అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే రొట్టెలు, పాస్తా, కేకులు వంటి పండి పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయానికి ప్రమాదం వాటిల్లుతుంది. రోజువారీ ఆహారంలో ఉప్పును తక్కువ తీసుకోవడం మంచిది. ఉప్పును ఎక్కువగా వాడేవారు కాలేయ సమస్యతో పాటు అధిక రక్తపోటును ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆల్కహాల్ సేవించే వారిలో కాలయంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా మద్యం సేవించే వారిలో కాలేయ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలు కూడా ఉండవచ్చు.

కాలేయం దెబ్బతింటుందంటే సంకేతాలివే..

కాలేయం దెబ్బతినే ముందు పలు సంకేతాలు వస్తుంటాయి. వాంతులు, ఆకలి లేకపోవడం, అలసట, విరేచనాలు, కామెర్లు, నిరంతరం బరువు తగ్గడం, శరీరంలో దురద, పొత్తికడుపులో ద్రవ ఏర్పడటం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఇవి కాలేయం దెబ్బతినే ముందు ఇలాంటి సంకేతాలు వస్తుంటాయి. అనుమానం ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

  1. వెల్లుల్లి: భారతీయ వంటింట్లో దొరికే వాటిలో వెల్లుల్లి కీలకమైనది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన ఆహార పదార్థాలలో భాగంగా వెల్లుల్లిని చేర్చడం వల్ల ఇది మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లిలో అధికభాగం యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది కాలేయానికి ప్రమాదం కలిగించే బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది.
  2. ఓట్ మీల్: తరచూ మన ఆహారంలో భాగంగా ఓట్ మీల్ తీసుకోవటం వల్ల అధిక మొత్తంలో ఫైబర్ మన శరీరానికి అందుతుంది. ఓట్ మీల్ లో అధికభాగం ఫైబర్ తో పాటు, బీటా-గ్లూకాన్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో కాలేయానికి ఎంతో సహకరిస్తాయి. కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వులను కరిగించడంలో దోహదపడుతుందని పలు అధ్యయనాల్లో రుజువైంది.
  3. చేపలు: కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలలో ముఖ్యంగా సాల్మన్ చేపలు అధిక భాగం ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఇవి మన కడుపులో ఏర్పడిన మంటను తగ్గించడంలో ఉపయోగపడే మంచి కొవ్వులు. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ సాల్మన్ చేపలను వారంలో కనీసం రెండు సార్లు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
  4. కాఫీ: ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. క్రమం తప్పకుండా ప్రతిరోజు కాఫీ తాగటం వల్ల మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ప్రతి రోజూ కాఫీ తాగడం వల్ల దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రభావం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల కాలేయంలో ఉన్న కొవ్వు పెరుగుదలను తగ్గించడమే కాకుండా, కాలేయంలో రక్షణాత్మక యాంటీఆక్సిడెంట్స్ పెంపొందించడంలో కూడా కాఫీ దోహదపడుతుంది.
  5.  గ్రీన్ టీ: కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో అధికభాగం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ఉంచడంలో దోహదపడతాయి.
  6. బెర్రీలు: బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి వివిధ రకాల బెర్రీ లలో అధిక భాగం పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి ఇవి కాలేయానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి రోజు ఈ బెర్రీస్ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  7.  ద్రాక్ష: ద్రాక్ష మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో కాలేయం దెబ్బ తినకుండా ఉండటానికి ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది. ద్రాక్ష, ద్రాక్ష రసం, విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాలేయంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
  8.  ఆలివ్ ఆయిల్: అధిక మొత్తంలో కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు తినడం కాలేయానికి మంచిది కాదు. ఒక అధ్యయనం ప్రకారం మన ఆహార పదార్థాలలో భాగంగా ఆలివ్ ఆయిల్ తీసుకోవటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి కాలేయ పనితీరు మెరుగు పడుతుందని నిపుణులు తెలియజేశారు. నూనెలలో అధిక మొత్తంలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండటమే దీనికి కారణమని చెప్పవచ్చు.
  9.  గుడ్లు: గుడ్లలో సల్ఫర్ సమ్మేళనాలు, మిథైలేషన్ ఎలిమెంట్స్ మరియు గ్లూటాతియోన్, ప్రొటీన్లు విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. గుడ్లలో కెరోటినాయడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది.
  10.  గింజలు: సాధారణంగా గింజలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో ఏర్పడే మంటను తొలగించడంతో పాటు, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో వాల్నట్, బాదం వంటి కొన్ని గింజలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గింజలు అధికభాగం కేలరీలను కలిగి ఉండటం వల్ల ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే అధికంగా శరీర బరువు పెరుగుతారు.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా