Psychological Stress: వెంటాడుతున్న మానసిక ఒత్తిళ్లు.. బయట పడటం ఎలా..?
ఏదో క్షణీకావేశంలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులో.. కుటుంబ సమస్యల వల్లనో.. ఇతర మానసిక ఒత్తిళ్ల కారణంగానో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. లేదా తక్కువ..
ఏదో క్షణీకావేశంలో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులో.. కుటుంబ సమస్యల వల్లనో.. ఇతర మానసిక ఒత్తిళ్ల కారణంగానో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. లేదా తక్కువ మార్కులు వచ్చాయనో ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఆత్మహత్యలకు పరిష్కారం కాదంటున్నారు సైకాలజీ నిపుణులు. అయితే మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
- అధిక టెన్షన్‌కు ఆహారం.. అదిక టెన్షన్‌కు గురవుతున్న సమయంలో మంచి ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. బలమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా మారి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. విటమిన్స్, మినరల్స్, మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.
- అతిగా ఆలోచించవద్దు: కొన్ని కొన్ని విషయాలను పదే పదే ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడికి గురై లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశాలుంటాయి. వరుసగా పనులు చేస్తుంటే ఒత్తిడికి గురవుతుంటారు. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి.
- ఒత్తిడి పెంచుకోవడం: అలాగే ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను సైతం చూడడం, వినడం కాని చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా బాగా కుంగిపోతాము. దీంతో ఆనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. ఇలా అధిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ఒంటరితనం వద్దు.. ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉండే సమయంలో వీలైనప్పుడు అందరితో కలిసిపోయేలా ఉండాలి. స్నేహితులతో మాట్లాడుతుండాలి. ఏవైనా సమస్యలుంటే వారితో షేర్ చేసుకుంటే కొంత కొంత ఒత్తిడి అనేది దూరమవుతుంది. చీకటిలో ఉండకుండా ఫ్రీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నిద్రలేమి సమస్య కూడా ఆరోగ్యానికి గురి చేస్తుంది. ఒత్తిడికి అనేక కారణాల్లో నిద్రలేమి. చాలా మంది రోజూకు నాలుగైదు గంటలు మాత్రమే పడుకుంటారు. మనం ప్రతి రోజు కనీసం ఆరు గంటలైన నిద్రించాలని నిపుణులు చెబుతున్నారు.
- విశ్రాంతి లేకుండా పనులు చేయడం: ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పనులు చేయడం, అలాగే వివిధ పరిశ్రమల్లో పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి నిద్ర ఖచ్చితంగా అవసరం. అలాంటి సమయంలో సరిగ్గా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి. అంతేకాదు సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి తప్పకుండా పాటిస్తే ఒత్తిడి నుంచి జయించవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి