AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buttermilk – Curd : మంచి ఆరోగ్యానికి పెరుగు ఉత్తమమా? మజ్జిగ ఉత్తమమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Buttermilk - Curd: వేసవి కాలంలో చల్లటి నీరు లేదా చల్లటి మజ్జిగ తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. శరీరంలోని వేడిని కంట్రోల్ చేయడానికి మజ్జిగ...

Buttermilk - Curd : మంచి ఆరోగ్యానికి పెరుగు ఉత్తమమా? మజ్జిగ ఉత్తమమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Curd
Shiva Prajapati
|

Updated on: Jun 12, 2021 | 7:44 AM

Share

Buttermilk – Curd: వేసవి కాలంలో చల్లటి నీరు లేదా చల్లటి మజ్జిగ తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. శరీరంలోని వేడిని కంట్రోల్ చేయడానికి మజ్జిగ తాగుతారు. అయితే, చాలా మంది మజ్జిగ కంటే పెరుగు తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. పెరుగు నుంచే మజ్జిగను తయారు చేస్తారు. కానీ, పెరుగు, మజ్జిగ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి.

పెరుగు, మజ్జిగ మధ్య పెద్దగా తేడా లేనప్పటికీ.. వాటి లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మనిషి శరీరానికి పెరుగు వాడకం ఎక్కువ ప్రయోజనమా? మజ్జిగ తాగడం ఎక్కువ ప్రయోజనకరమా? అనే దానిపై వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు, మజ్జిగ వేటిలో ఎక్కువ ప్రయోజనాలు దాగున్నాయి? వాస్తవానికి, పెరుగు కంటే మజ్జిగ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. పెరుగులో నీరు కలపడం ద్వారా అందులోని ప్రోటీన్ విచ్ఛిన్నమవుతుంది. తద్వారా సులభంగా జీర్ణం అవుతుంది. అందుకే మజ్జిగ వినియోగం జీర్ణ వ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఇది పెరుగు కంటే మెరుగైన హైడ్రేటర్ గా పనిచేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూస్తుంది.

ఇక పెరుగులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ లేని వారికి పెరుగు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు మరియు మజ్జిగ రెండూ విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఈ రెండింటి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. వేర్వేరు పరిస్థితులలో తీసుకున్నప్పుడు వారికి వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. వైద్యులు కూడా అనేక వ్యాధులలో బాధపడుతున్న వారు పెరుగు తినాలని సిఫార్సు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో పెరుగును తిరస్కరించలేము. ఎందుకంటే ఇది కూడా శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మజ్జిగ జీర్ణవ్యవస్థను సక్రమం చేస్తుంది. అలాగే నిర్జలీకరణంతో పోరాడుతుంది. ఇది మసాలా ఎక్కువగా వేసిన ఆహారం తిన్న తరువాత కడుపు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే, మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, మజ్జిగ మీకు కరెక్ట్ అని చెప్పాలి. ఇందులో కాల్షియం ఉంటుంది. అనేక విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Also read:

Black Magic: వరంగల్‌లో వీడిన సతీష్ మిస్సింగ్ మిస్టరీ.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు.. అసలేం జరిగిందంటే..