కనురెప్పలు అదరడం దేనికి సంకేతం? వైద్యులు ఏమంటున్నారు?
కనురెప్పలు అదరడం అనేది సాధారణ విషయమే. అయితే, అదే పనిగా అవి కొట్టుకుంటే మాత్రం వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, సరైన నిద్ర లేకపోవడం, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడటం, కళ్ల పొడిబారడం, కాఫీన్, మద్యం అధికంగా తీసుకోవడం, మాగ్నీషియం వంటి ఖనిజాల లోపం కారణంగా కనురెప్పలు అదురుతుంటాయని చెబుతున్నారు.

సాధారణంగా అప్పుడప్పుడు కనురెప్పలు కొట్టుకోవడం (అదరడం) అనేది సాధారణ ప్రక్రియే. అయితే, తరచూ ఇలా జరిగితే మాత్రం వైద్యులను సంప్రదించాలంటున్నారు నిపుణులు. హిందూ ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లయితే.. కుడి కనురెప్పలు కొట్టుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఎడమ కనురెప్పలు కొట్టుకోవడాన్ని అశుభంగా పరిగణిస్తారు. అయితే, ఆరోగ్యశాస్త్ర పరంగా మాత్రం వీటికి వేరే కారణాలున్నాయి.
సాధారణంగా ఒత్తిడి లేదా అలసట కారణంగా కనురెప్పలు అదురుతుంటాయి. అయితే, చాలా కాలంపాటు అదురుతూనే ఉంటే మాత్రం అది ఆరోగ్య సమస్యగా భావించాలి. అయితే, ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కనురెప్పలు ఎందుకు కంపిస్తాయి?
కంటి వైద్యుల వివరాల ప్రకారం.. కన్ను చుట్టూ ఉన్న మసిల్స్ అనుకోకుండా కుదించుకోవడం వల్ల రెప్పలు కంపిస్తాయి. దీనిని వైద్యపరంగా మయోకైమియా లేదా బ్లెఫరోస్పాజంగా పిలుస్తారు.
సాధారణ కారణాలు ఇవే:
వైద్యుల మాటల్లో చెప్పాలంటే, కింది కారణాల వల్ల ఎక్కువగా ఈ సమస్య వస్తుంది:
మానసిక ఒత్తిడి, ఆందోళన
సరైన నిద్ర లేకపోవడం
మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడటం
కళ్ల పొడిబారడం
కాఫీన్, మద్యం అధికంగా తీసుకోవడం
మాగ్నీషియం వంటి ఖనిజాల లోపం వంటి ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.
సాధారణంగా రెప్పలు కొట్టుకోవడం అనేది తనంత తానే తగ్గిపోతుంది. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి:
రెప్పల కొట్టుకోవడం కొన్ని రోజుల పాటు తగ్గకపోవడం
కన్ను పూర్తిగా మూసుకుపోయేంత తీవ్రమైన కంపనం
ముఖంలోని ఇతర భాగాలకు కూడా కంపనం వ్యాప్తి చెందడం
కంటి నొప్పి, వాపు, చూపులో మార్పులు
రెప్పలు వాలిపోవడం
చికిత్స ఎలా ఉంటుంది?
లక్షణాల ఆధారంగా వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైతే MRI వంటి స్కాన్లు సూచించవచ్చు.
నివారణకు ఏం చేయాలి?
సరిపడా నిద్ర
ఒత్తిడి తగ్గించుకోవడం
కాఫీన్ తగ్గించడం
కళ్లకు తేమనిచ్చే డ్రాప్స్ అనేవి సూచిస్తారు. తీవ్రమైన సందర్భాల్లో బోటాక్స్ చికిత్స కూడా అందుబాటులో ఉంది.
వైద్యుల సూచన:
కన్ను రెప్పలు కంపించడం చాలా సందర్భాల్లో ప్రమాదకరం కాదు. అయినప్పటికీ, దీర్ఘకాలంగా ఇది కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
