AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో అందుబాటులోకి మరో ఎయిర్‌పోర్ట్..! తొలి విమానం ల్యాండ్..

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలో మరో ఎయిర్‌పోర్ట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. జూన్‌ చివరి నాటికి ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆదివారం చివరి ట్రయల్ రన్ జరగనుందని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..

Andhra News: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో అందుబాటులోకి మరో ఎయిర్‌పోర్ట్..! తొలి విమానం ల్యాండ్..
Bhohapuram Airport
Venkatrao Lella
|

Updated on: Jan 04, 2026 | 7:19 AM

Share

Bhogapuram Airport: ఏపీ ప్రజలకు ఇది సంక్రాంతి కానుకగా చెప్పవచ్చు. ఎందుకంటే త్వరలో ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుంది. దీని వల్ల రాష్ట్రం ఆర్ధికంగా, పారిశ్రామికంగా మరింతగా అభివృద్ది చెందనుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌తో అంతర్జాతీయ రవాణా కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే కొత్త కంపెనీలు రాక, హోటళ్లు, ఆతిధ్య, పర్యాటక రంగం వృద్ది చెందనుంది. దీని వల్ల వేల మంది నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించనుంది. ఇప్పటికే ఏపీలో చాలా జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా.. ఇప్పుడు మరో కీలక ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్దమైంది. పనులు దాదాపు పూర్తవ్వడంతో ఆదివారం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

నేడు చివరి ట్రయల్ రన్

రాష్ట్ర ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నేడు చివరి ట్రయల్ రన్‌ను పూర్తి చేసుకోనుంది. ఆదివారం ఎయిర్‌పోర్ట్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానం ఇక్కడ ల్యాండ్ కానుంది. ట్రయల్ రన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ఢిల్లీ నుంచి భోగాపురంకు చేరుకోనున్నారు. ఈ చివరి ట్రయల్ రన్ పూర్తైన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సర్వీసులు అందించే విమానయాన సంస్ధలతో అధికారులు చర్చలు జరపనున్నారు.

జూన్ 26న ప్రారంభం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఈ ఏడాది జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఇప్పటికే 96 శాతం పనులు పూర్తవ్వగా., తుఫాన్లను తట్టుకోలిగే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. రోజుకు 200 విమానాలు దిగేలా, ఏటా 20 వేల టన్నుల సరుకు ఎగుమతి చేసేలా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రాత్రిపూట ఏకంగా 18 విమానాలను పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక 14 ఇమిగ్రేషన్ సెంటర్లను ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌కి సులువుగా వెళ్లేలా మూడు రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఎయిర్‌పోర్ట్ లోపల అల్లూరి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. గంటకు 10 నుంచి 12 విమానాలు దిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా.. తొలి ఏడాదిలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు.

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో