Health Tips: గుడ్లు vs ఓట్స్ vs ఇడ్లీ.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏది బెటర్.. డాక్టర్ రెఫర్ చేసేది ఏది!
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లోకి మంచి ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి AIIMS-శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి మన గట్ హెల్త్‌తో పాటు పూర్తి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మార్నింగ్‌లో బ్రేక్ పాస్ట్‌లోకి ఇడ్లీ, దోశా, లేదా గుడ్లు మూడింటిలో ఏది ఉత్తమమైనదో వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బిజీలైఫ్ కారణంగా చాలా మంది త్వరగా, సులభంగా తయారు చేసుకోగలిగే అల్పాహారాన్ని తీసుకుంటారు. కానీ మనం ఉదయం తినే ఆహారం మన రోజంతా ఎలా ఉంటామో నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు, మనం ఆరోగ్యంగా భావించి తినే ఆహారాలే మన ప్రేగులకు, అంటే మన కడుపుకు హానికరం కావచ్చు. కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సరైన అల్పాహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం, దీన్ని దృష్టిలో ఉంచుకుని, AIIMS-శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి సాధారణ అల్పాహారాలు.. అవి మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరించారు. వాటి ప్రకరాం.. మీకు ఏ బ్రేక్‌ఫాస్ట్ ఉత్తమమైనదో మీరే డిసైడ్ చేసుకోండి.
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏది తీసుకోవడం బెస్ట్ అనేది రేటింగ్స్ ప్రకారం తెలుసుకోండి
గుడ్లు: బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లను డాక్టర్ సేథి మొదటి స్థానంలో ఉంచారు, వాటికి 10కి 10 రేటింగ్ ఇచ్చారు. గుడ్లలో అధిక-నాణ్యత ప్రోటీన్ ఉంటుందని, ఇది శరీరం సులభంగా జీర్ణమవుతుందని ఆయన చెప్పారు. గుడ్లు తినడం వల్ల కడుపు చాలా సేపు నిండి ఉంటుంది, ఇది ఆకలి బాధలను తగ్గిస్తుందిని తెలిపారు.అలాగే గుడ్లు పేగు ఆరోగ్యం, జీవక్రియకు మెరుపర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయన్నారు.
ఓట్స్ : డాక్టర్ సేథి ఓట్స్‌ను మంచి అల్పాహారంగా సిఫార్సు చేస్తున్నారు, ముఖ్యంగా వాటిలో బీటా-గ్లూకాన్ ఫైబర్ ఉంటుంది, ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇది శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. అయితే, సరైన రకమైన ఓట్స్‌ను ఎంచుకోవడం ముఖ్యం. స్టీల్-కట్ లేదా రోల్డ్ ఓట్స్ ఉత్తమమైనవి ఆయన అంటున్నారు, అయితే ఇన్‌స్టంట్ ఓట్స్‌ను నివారించాలని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే అవి అధికంగా ప్రాసెస్ చేయబడతాయి రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతాయి.
ఇడ్లీ, దోస: దీనితో పాటు, డాక్టర్ సేథి స్మూతీ, వేరుశెనగ వెన్న, ఇడ్లీ-దోసలను అల్పాహారానికి మంచి ఎంపికలుగా అభివర్ణించారు, అయితే ఆయన తృణధాన్యా గ్రానోలాకు తక్కువ రేటింగ్ ఇచ్చారు. పైన పేర్కొన్న రేటింగ్స్ ఆధారంగా గుడ్లు, ఓట్స్, ఇడ్లీ దోశాలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏది ఉత్తమైనదో మీరే డిసైడ్ అవ్వండి.
View this post on Instagram
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
