Coriander Water: ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Health Benefits of Coriander Water: వంటగదిలో ఉన్న ఔషధాల మేలు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు..

Coriander Water: ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Health Benefits Of Coriander Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 19, 2021 | 6:05 AM

Health Benefits of Coriander Water: వంటగదిలో ఉన్న ఔషధాల మేలు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు.. ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అలాంటి దినుసుల్లో ధనియాలు.. ఒకటి. ధనియాలు ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఎ, సీ, కె పుష్కలంగా ఉంటాయి. ధనియాలను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. నీటిలో ధనియాలు వేసి మరగబెట్టి తాగొచ్చు. పౌడర్‌ను నీటిలో కలుపుకోని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ధనియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ధనియాలు చేసే మేలు.. ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ధనియాల నీరు ప్రయోజనాలు..

• ధనియాల నీటిని ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే సులువుగా బరువు తగ్గవచ్చు. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి. • ఆర్థరైటిస్, శరీర నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎముకలకి బలాన్ని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచడంలో ధనియాలు మేలు చేస్తాయి. • శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చేస్తాయి. దీంతోపాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా అడ్డుకుంటాయి. నీరసం, బలహీనత నుంచి కూడా కాపాడుతాయి. • కిడ్నీ, చర్మ, జట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. మూత్రపిండాలను పాడుచేసే మలినాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచుతాయి. • ముఖం ఉబ్బుగా ఉన్నా.. శరీరంలో ఉబ్బుగా ఉన్నా దనియాల నీరు తాగితే తగ్గుతుంది. అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా దనియాల నీటిని తాగాలని సూచిస్తున్నారు. నీటిలో దనియాలను వేసి మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు ధనియాల పౌడర్ కూడా వాడవచ్చు. అయితే.. ఉదయాన్నే పరిగడుపున ధనియాల నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Also Read:

Barley Water Benefits: ఆరోగ్యానికి బార్లీ వాటర్.. రోజూ తాగి ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..?

పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..