మహిళలకు ప్రధాన సమస్యగా మారిన ఐరన్ లోపం.. రక్తంలో ఐరన్ పెంచుకోవడానికి వీటిని తప్పకుండా తినాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. ఇది కోవిడ్ నియంత్రణ సహయపడడమే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలను నియంత్రిస్తుంది.

మహిళలకు ప్రధాన సమస్యగా మారిన ఐరన్ లోపం.. రక్తంలో ఐరన్ పెంచుకోవడానికి వీటిని తప్పకుండా తినాలి..
Iron Rich Food
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2021 | 8:37 PM

ప్రస్తుత పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి ఎంతో అవసరం. ఇది కోవిడ్ నియంత్రణ సహయపడడమే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలను నియంత్రిస్తుంది. ఇక కరోనా పుణ్యమా అని ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంపోందించుకునేందుకు జంక్ ఫుడ్ కాకుండా.. పండ్లు, కూరగాయలను తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి పెరగాలంటే ముఖ్యంగా రక్తంలో ఐరన్ శాతం తగినంత ఉండాలి. రక్తహీనత వలన బోలెడు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇక ఐరన్ ఉండే ఆహార పదార్థాలు ఎంటో తెలుసా..

Pomogranate

దానిమ్మ.. ఇందులో ఐరన్, మెగ్నిషియం, క్యాల్షియం వంటి మూలకాలతోపాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఈ పండు లేదా రసం తీసుకోవాలి. లేకపోతే దానిమ్మ గింజల పొడి మార్కెట్లో లభిస్తుంది. రోజుకు రెండు చెంచాల పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగితే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

Beetroot

బీట్ రూట్.. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడంలో సహయపడుతుంది. దీని ఆకుల్లో దుంపలో కంటే మూడు రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుంది.

Banana

అరటి పండ్లు.. ఇందులో ఐరన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా వీటిని తీసుకోవాలి.

Guava

జామ.. ఇందులో విటమిన్ సి తోపాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచుతుంది.

Apple

యాపిల్.. ఇది రోజూ తింటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచిది.

Palak Curry

పాలకూర.. ఇందులో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి కూర, పప్పు, సూప్ ఇలా మీకు నచ్చిన పద్ధతిలో దీనిని తీసుకోండి.

Also Read: Covid Care: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

పండ్లు, కూరగాయలు తినడం వలన ఒత్తిడి ఫసక్… అధ్యయనాల్లో వెలువడిన సంచలన విషయాలు..

ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..