Black fungus : అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. విషయం బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్తలు.!
Black fungus in Anantapur District : ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ పడగ విప్పుతోంది..
Black fungus in Anantapur District : ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ పడగ విప్పుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. జిల్లా వాసుల్లో తాజాగా ఇద్దరికి బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్త వహిస్తోంది. ముగ్గురు హిందూపురం వాసుల్లోనూ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్టెరాయిడ్‌లు వాడిన …. కరోనా బాధితుల్లో టెన్షన్ నెలకొంది. అటు, తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా వచ్చినవాళ్లు స్టెరాయిడ్స్ అధికంగా వాడటమే ఈ ఫంగస్ కు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అటు, ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్లాక్ ఫంగస్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి. పట్టణంలో ఆరు బ్లాక్‌ఫంగస్ కేసులు వెలుగుచూసినట్లు మార్కాపురం కొవిడ్ సెంటర్ ఇన్‌ఛార్జి డాక్టర్ రాంబాబు తెలిపారు. వారిలో ముగ్గురు నంద్యాలలో చికిత్స పొందుతుండగా.. మరో ముగ్గురు ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వివరించారు. బ్లాక్‌ఫంగస్‌కు ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చు చేశామన్న ఓ బాధితుడు.. కంటి ఆపరేషన్ కు రూ.10 లక్షలు అవుతాయని డాక్టర్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : Atchannaidu : ‘వింత మనిషి వింత చేష్టలు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా ఉండాలి’ : అచ్చెన్నాయుడు