Atchannaidu : ‘వింత మనిషి వింత చేష్టలు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా ఉండాలి’ : అచ్చెన్నాయుడు

Atchannaidu : జగన్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది.. ఈ రెండేళ్లలో ఎన్ని సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...

Atchannaidu : 'వింత మనిషి వింత చేష్టలు..  బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా ఉండాలి' : అచ్చెన్నాయుడు
Atchannaidu
Follow us
Venkata Narayana

|

Updated on: May 18, 2021 | 6:43 PM

Atchannaidu : జగన్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది.. ఈ రెండేళ్లలో ఎన్ని సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బడ్జెట్ సమావేశాలు పెట్టి బిల్లులు ఆమోదం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్న ఆయన ఆర్థినేన్స్ ద్వారా బడ్జెట్ సమావేశాలు గతంలో చూశామని విమర్శించారు. మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు పెట్టాలి.. ఆరోజు టీడీపీ కూడా సమావేశాలు పెట్టమని కోరితే, కరోనా ఉందని తప్పించుకున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఇప్పుడు కరోనా ఉంది.. ఎలా అసెంబ్లీ పెడుతున్నారని ఆయన జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క రోజు సమావేశాలు పెట్టి తూతూ మంత్రంగా చేయాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బాధ్యత ఉంటే అఖిలపక్షం సమావేశం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టడి కి వైద్యులతో ఒక్క రోజు అయినా సమావేశం పెట్టారా అని సీఎం ను ప్రశ్నించారు. వింత మనిషి వింత చేష్టలంటూ ఎద్దేవా చేశారు. టీకా అందజేయడంలో జగన్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని అచ్చెన్న అన్నారు.

Read also : Telangana Covid : తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నిస్తున్నాయి : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్