AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: ఫ్రూట్స్ తో వెయిట్ లాస్ అవ్వండి.. ఎలా అంటే!!

మనకు సంపూర్ణ పోషల అందించడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అందులోనూ సీజనల్ గా వచ్చే పండ్లను అస్సలు మిస్ చేయకుండా తినాలి. కానీ మనకు నీరసంగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మాత్రమే అవి గుర్తొస్తాయి. పండ్లోల శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్స్, ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది అతిగా పండ్లను తినేస్తారు. అన్నా తిన్నా కూడా అనారోగ్యం పాలవుతారని నిపుణులు చెబుతున్నారు. రోజూ సరైన మోతాదులో ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల ఎన్నో..

Weight Loss Tips: ఫ్రూట్స్ తో వెయిట్ లాస్ అవ్వండి.. ఎలా అంటే!!
Fruits Benefits
Chinni Enni
|

Updated on: Sep 06, 2023 | 8:34 PM

Share

మనకు సంపూర్ణ పోషల అందించడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అందులోనూ సీజనల్ గా వచ్చే పండ్లను అస్సలు మిస్ చేయకుండా తినాలి. కానీ మనకు నీరసంగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మాత్రమే అవి గుర్తొస్తాయి. పండ్లోల శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్స్, ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది అతిగా పండ్లను తినేస్తారు. అన్నా తిన్నా కూడా అనారోగ్యం పాలవుతారని నిపుణులు చెబుతున్నారు. రోజూ సరైన మోతాదులో ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అందులోనూ ప్రస్తుతం అధిక బరువుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు పండ్లను తమ డైట్ లో చేర్చుకుని ఈజీగా బరువు తగ్గొచ్చు. మరి బరువు తగ్గేందుకు పండ్లను ఎలా తీసుకుంటే బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు, చీజ్ తో పండ్లు:

మీరు బరువు తగ్గాలనుకుంటే.. ప్రోటీన్ తో కలిపి తీసుకోవాలి. కాటేజ్ చీజ్ పండ్లు, గ్రీక్ పెరుగు, నట్స్ వంటి రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. పెరుగు, నట్స్ వల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. అలాగే కెలరీస్ కూడా ఎక్కువగా అందుతాయి. కాబట్టి వేరేవి తినాలన్న కోరిక ఉండదు.

ఇవి కూడా చదవండి

ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు:

పండ్లను ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఖాళీ కడుపుతో పండ్లు తింటే.. బ్లడ్ లో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి ప్రోటీన్, తృణ ధాన్యాలు, పండ్లు కలిపి తీసుకుంటే బెటర్.

ఎక్కువగా తినకూడదు:

ఫ్రూట్సే కదా ఏమీ కాదని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పండ్లలోనే కెలరీస్, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన మోతాదులో తినాలి.

కేవలం ఫ్రూట్స్ మీదనే ఆధారపడకూడదు:

చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఫ్రూట్స్ తింటున్నాం కదా అని బ్రేక్ ఫాస్ట్, లంచ్ పై ఆసక్తి చూపించరు. కానీ ఇది చాలా తప్పు. ఇలా చేస్తే బరువు తగ్గడం సంగతి పక్కన పెడితే.. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కొన్ని రకాల పండ్లను మీ భోజనం, మరికొన్ని స్మూతీలలో, సలాడ్స్, నట్స్ ఇలా కలుపుతూ తీసుకుంటూ ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?