Spicy Food: వర్షాకాలంలో స్పైసీ, వేడి ఫుడ్ తింటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!!

వర్షాకాలం వచ్చేసింది.. దీంతో వేడి వేడిగా స్పైసీగా ఫుడ్, సూప్స్, స్నాక్స్ కానీ తినాలని పిస్తుంది. మన ఇండియాలో ఎవరైనా అంతే.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు. ఎందుకంటే బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో స్పైసీ ఫుడ్ తినకూడదని..

Spicy Food: వర్షాకాలంలో స్పైసీ, వేడి ఫుడ్ తింటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే!!
Spicy Food
Follow us
Chinni Enni

|

Updated on: Sep 06, 2023 | 7:49 PM

వర్షాకాలం వచ్చేసింది.. దీంతో వేడి వేడిగా స్పైసీగా ఫుడ్, సూప్స్, స్నాక్స్ కానీ తినాలని పిస్తుంది. మన ఇండియాలో ఎవరైనా అంతే.. వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే వేడి వేడి, స్పైసీ ఫుడ్ కే మక్కువ చూపిస్తారు. ఎందుకంటే బాడీలో ఉష్ణోగ్రత పెంచడానికి. బయట కూల్ ఉంటే.. బాడీలో టెంపరేచర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి వేడి, స్పైసీ ఫుడ్ కే ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఇలా తింటే వ్యాధులు కూడా దరిచేరవని పెద్దల నమ్మకం. అయితే వర్షా కాలంలో స్పైసీ ఫుడ్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మనం వాడే ఘాటైన మసాలాలతో పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి వీటివల్ల ప్రయోజనాలు ఏంటో, నష్టాలేంటో ఓ లుక్కేసేయండి.

జీవక్రియ:

వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ తింటే అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మీరు తీసుకునే ఆహారం.. జీవక్రియపై ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడాదు.

ఇవి కూడా చదవండి

గుండె పై ప్రభావం చూపుతుంది:

గుండె సమస్యలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువ అయ్యాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా.. పని చేయాలన్నా స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని చెప్పవచ్చు. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ తింటే హై కొలెస్ట్రాల్, హైబీపీ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయి.

ప్రేగు ఆరోగ్యం:

ప్రేగులు ఆరోగ్యంగా ఉంటేనే మనం తినే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఉప్పు, స్పైసీ ఫుడ్ తింటే గట్ లోని చెడు బ్యాక్టీరియా తగ్గించి, మంచి బ్యాక్టీరియాని పెంచుతాయి.

నొప్పి నివారిణి:

రెయినీ సీజన్ లో స్పైసీ ఫుడ్ తింటే నొప్పి నివారిణిగా పని చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటీస్, డయాబెటీస్ ఉన్న వారిలో స్పైసీ ఫుడ్ నొప్పిని తగ్గించేందుకు సహాయ పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి