Myrobalan Benefits: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కరక్కాయతో చెక్ పెట్టండి!
శరీరాన్నంతటిని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సిందే. మన ఆహారపు అలవాట్ల కారణంగానే కాలేయం దెబ్బతింటుంది. ఎసిడిటి ఫుడ్స్, ఆల్కాహాల్, జంక్ ఫుడ్, బేకరీ ఐటెమ్స్ వల్ల చాలా మందిలో లివర్ కణాలు దెబ్బతిని, కాలేయ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తించకపోతే.. ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లివర్ కణాల్లో ఉండే ఎంజైమ్ లు కణాల..
శరీరాన్నంతటిని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే అనారోగ్యాల బారిన పడాల్సిందే. మన ఆహారపు అలవాట్ల కారణంగానే కాలేయం దెబ్బతింటుంది. ఎసిడిటి ఫుడ్స్, ఆల్కాహాల్, జంక్ ఫుడ్, బేకరీ ఐటెమ్స్ వల్ల చాలా మందిలో లివర్ కణాలు దెబ్బతిని, కాలేయ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తించకపోతే.. ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లివర్ కణాల్లో ఉండే ఎంజైమ్ లు కణాల నుండి పూర్తిగా లీకవుతాయి. దీంతో కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి.
ఈ కణాలు దెబ్బతినడంతో మన ఆరోగ్యం కూడా క్రమ క్రమంగా క్షీణిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు పాటిస్తే.. ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. క్షీణించిన కణాలు మళ్లీ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే.. కరక్కాయ బాగా పని చేస్తుంది. కరక్కాయలో ఉండే రసాయన సమ్మేళనాలు.. కాలేయ కణాల డీఎన్ఏలో మార్పులు తీసుకువచ్చి కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడేందుకు సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కణాల నుండి ఎంజైమ్ లు లీక్ అవ్వకుండా ఉండేందుకు కరక్కాయ బాగా సహాయపడుతుంది.
జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు, ఆల్కాహాల్ తీసుకునే వారు, ఫ్యాటీ లీవర్ సమస్యలు ఉన్నవారు, ఊబకాయం సమస్యతో బాధపడే వారు, ఇతర కాలేయ సమస్యలు ఉన్నవారు కరక్కాయను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు నిపుణులు.
కరక్కాయను ఎలా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది:
కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కరక్కాయను పొడిగా చేసుకుని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల, కరక్కాయ కషాయాన్ని తాగడం వల్ల లేదా కరక్కాయను లేపనంగా చేసి తినడం వల్ల కాలేయ కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. ఒక వేళ కణాలు దెబ్బతిన్నా.. అవి మళ్లీ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి