Babies Natural Massage Oil: పిల్లలకు మసాజ్ ఆయిల్ ను ఇంట్లోనే సొంతంగా తయారు చేయండిలా!!

పిల్లల దగ్గరికి వచ్చే సరికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు తల్లులు. వారికంటూ సపరేట్ కేర్ తీసుకుంటారు. వారు లేచిన దగ్గర్నుంచి.. పడుకునే వరకు వారిని ఒక మహారాజు.. మహారాణిలా ట్రీట్ చేస్తారు. పిల్లలతో పోల్చితే వారి స్కిన్, జుట్టు కూడా వేరేగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు రాసే మసాజ్ ఆయిల్ గురించి తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది పిల్లలకు కొన్ని రకాల ఆయిల్స్ అస్సలు పడవు. ఎలర్జీస్ వస్తాయి. కాబట్టి ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పిల్లలకు చేసే మసాజ్ ఆయిల్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆయిల్ ను ఎలా..

Babies Natural Massage Oil: పిల్లలకు మసాజ్ ఆయిల్ ను ఇంట్లోనే సొంతంగా తయారు చేయండిలా!!
Babies Massage Oil
Follow us

|

Updated on: Sep 06, 2023 | 8:23 PM

పిల్లల దగ్గరికి వచ్చే సరికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు తల్లులు. వారికంటూ సపరేట్ కేర్ తీసుకుంటారు. వారు లేచిన దగ్గర్నుంచి.. పడుకునే వరకు వారిని ఒక మహారాజు.. మహారాణిలా ట్రీట్ చేస్తారు. పిల్లలతో పోల్చితే వారి స్కిన్, జుట్టు కూడా వేరేగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు రాసే మసాజ్ ఆయిల్ గురించి తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కొంతమంది పిల్లలకు కొన్ని రకాల ఆయిల్స్ అస్సలు పడవు. ఎలర్జీస్ వస్తాయి. కాబట్టి ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పిల్లలకు చేసే మసాజ్ ఆయిల్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆయిల్ ను ఎలా తయారు చేయాలి? తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.

బేబీ హోమ్ మసాజ్ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఆముదం, ఆలీవ్ ఆయిల్, లావెండర్ ఆయిల్

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఓ గిన్నె లేదా డబ్బాలో ఓ రెండు టేబుల్ స్పూన్ ఆముదం తీసుకోవాలి. దానిలోకి స్వచ్ఛమైన ఒక టేబుల్ స్పూన్ ఆలీవ్ ఆయిల్ ను కలపాలి. అందులో ఓ రెండు చుక్కల లావెండర్ ఆయిల్ వేయాలి. వీటన్నింటి బాగా కలపండి. అంతే బేబీ మసాజ్ ఆయిల్ రెడీ. దీన్ని స్కిన్ కి, జుట్టుకు కూడా వాడుకోవచ్చు.

గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు:

– ఈ బేబీ ఆయిల్ తయారు చేయడానికి కావాలంటే కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. అయితే అది స్వచ్ఛమైనదై ఉండాలి. కావాలంటే కొబ్బరి నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనె స్వచ్ఛంగా లేకపోతే పిల్లలకు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.

– పిల్లలకు రాసే ఆయిల్ ను వేడి చేసే పద్దతి కూడా వేరేలా ఉంటుంది. డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టి వేడి చేయకూడదు. డబుల్ బాయిల్ మెథడ్ లో నూనె వేడి చేసి.. పిల్లలకు మసాజ్ చేయాలి.

– ఇలా వేడి అయిన ఆయిల్ ను ఓ గాజు లేదా స్టీల్ డబ్బాలో పెట్టడం మంచింది. ప్లాస్టిక్ డబ్బా వాడకపోవడమే బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి