Weight Loss Tips: నిద్రతో అధిక బరువుకు చెక్!.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడి..

Weight Loss Tips: నిద్రతో అధిక బరువుకు చెక్!.. తాజా అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడి..
Sleeping

Weight Loss Tips: ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలా మంది ప్రజలు అధిక బరువుతో సతమతం అవుతున్నారు. సమయానికి ఆహారం

Shiva Prajapati

|

Mar 05, 2022 | 7:36 AM

Weight Loss Tips: ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలా మంది ప్రజలు అధిక బరువుతో సతమతం అవుతున్నారు. సమయానికి ఆహారం తినకపోవడం, నిద్ర పోకపోవడం వంటి వాటివల్ల శరీరం బరువు అమాంతం పెరిగిపోతుంది. దాంతోపాటు.. లేనిపోని కొత్త రోగాలు బోనస్‌గా వచ్చి చేరుతున్నాయి. అయితే, వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే ఆరోగ్యంపై కాసింత దృష్టి పెట్టడం చాలా అవసరం. అయితే, తాజాగా పలువురు నిపుణులు బరువుకు సంబంధించి చేసిన పరిశోధనలో కీలక అంశాలు వెలుగు చూశాయట. బరువుకు, నిద్రకు లింక్ ఉందని తేల్చారు పరిశోధకులు. సరిగా నిద్రపోతే.. బరువు తగ్గుతారని చెబుతున్నారు. అయితే.. మీరు బరువు తగ్గాలంటే ముందుగా మీ నిద్ర షెడ్యూల్ మార్చుకోండి అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. కోడి నిద్రలా కాకుండా.. గాఢ నిద్ర తప్పనిసరి అని చెబుతున్నారు.

మరి నిద్రతో బరువు ఎలా తగ్గుతుందో తెలుసుకుందాం.. ప్రతి రోజూ ఒక గంట సేపు అదనంగా నిద్రపోవడం వలన 260 కేలరీల శక్తి బర్న్ అవుతుందట. ఇలా రోజుకు 260 కేలరీలు బర్న్ చేయగలిగితే.. సంవత్సరానికి దాదాపు 9 పౌండ్ల బరువును సునాయాసంగా కోల్పోతారు. అలాగే పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు గానీ, ప్రోటీన్స్ ఉండే డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. అర్థరాత్రి ఆకలివేయకుండా కంటినిండా నిద్ర వస్తుంది. ప్రోటీన్.. కార్బోహైడ్రేట్స్ కంటే చాలా ఎక్కువ థర్మోజెనిక్. ఫలితంగా నిద్రపోతున్నప్పుడు ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయట.

అలాగే నిద్రపోయినప్పుడు దుప్పటి కప్పుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిద్రపోవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఫలితంగా శరీరం ఒకేసారి ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిద్రపోవడం వల్ల శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కొవ్వులు శరీరానికి ఆరోగ్య పరంగా మంచివి. ఈ ఫ్యాట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

చాలా మంది రాత్రి భోజనానికి దూరంగా ఉంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిద్రపోయే ముందు తినకపోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. రాత్రి బోజనం చేయకపోతే అర్థరాత్రి ఆకలి వేస్తుంది. ఇది జీవక్రియపై ప్రతికూలంగా ప్రభావం చూపి.. జీర్ణ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు స్లీపింగ్ మాస్క్ ధరిస్తే ప్రయోజనం ఉంటుంది. చీకటి గదిలో పడుకునే వారు ఇతరులతో పోలిస్తే బరువు పెరిగే అవకాశం 21 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల స్లీపింగ్ మాస్క్ ధరించడం మంచిది.

Also read:

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..

Medaram Hundi: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఈసారి తగ్గిన ఆదాయం.. ఇంకా తేలాల్సిన బంగారం, వెండి కానుకల లెక్కలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu