AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaf Benefits: షుగర్, అధిక కొవ్వు సమస్యతో సతమతం అవుతున్నారా?.. కరివేపాకుతో చెక్ పెట్టండిలా!

Curry Leaf Benefits: రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ పెరగడం ఆరోగ్యానికి ప్రమాదకరం అనే విషయం తెలిసిందే. ఇది అనేక తీవ్రమైన

Curry Leaf Benefits: షుగర్, అధిక కొవ్వు సమస్యతో సతమతం అవుతున్నారా?.. కరివేపాకుతో చెక్ పెట్టండిలా!
Curry Leafs
Shiva Prajapati
|

Updated on: Mar 05, 2022 | 7:21 AM

Share

Curry Leaf Benefits: రక్తంలో కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ పెరగడం ఆరోగ్యానికి ప్రమాదకరం అనే విషయం తెలిసిందే. ఇది అనేక తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే మధుమేహంతో సహా అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండింటినీ నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

అయితే, కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. మంచి కొవ్వులు(HDL), చెడు కొవ్వులు(ఆల్డిక్). శరీరంలోని అనేక అవయవాల పనితీరు మెరుగ్గా ఉండేందుకు మంచి కొలెస్ట్రాల్ అవసరం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికమయితే.. అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక బ్లడ్ షుగర్, బ్లడ్ గ్లూకోజ్ మీరు తినే ఆహారం నుండి వస్తుంది. శరీరానికి శక్తినిచ్చే ప్రధాన వనరు గ్లూకోజ్. దీనిని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగితే అలసట, వికారం, దాహం పెరుగుతుంది. అలాగే అధిక మూత్ర విసర్జన సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి లేదా తగ్గించడానికి అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ద్వారా కూడా నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుందట. తాజాగా కరివేపాకుపై ఓ పరిశోధనా బృందం జరిగిపన అధ్యయనంలో దీనిని తేల్చారు. కరివేపాకు.. రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందని ఆ నివేదిక పేర్కొంది.

ఈ అధ్యయనం ప్రకారం.. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుత లక్షణాలను కరివేపాకు కలిగి ఉంది. కరివేపాకును తిన్న తరువాత కొలెస్ట్రాల్ స్థాయి 26.6 +/- 16.6 mg తగ్గిందని అధ్యయనం పేర్కొంది. డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించే గుణం కూడా కరివేపాకులో ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అధ్యయనంలో, ఎలుకలకు వరుసగా 10 రోజుల పాటు 40 mg కరివేపాకు సారాన్ని అందించారు. ఆ అధ్యయనంలో వచ్చిన ఫలితాలను చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. దీని ఆధారంగా కరివేపాకు రసం రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని నిర్ధారించారు. అంతేకాదు.. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని తేల్చారు. ఈ ప్రయోగంలో ఎలుకల శరీర బరువు కూడా తగ్గినట్లు పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు.

కరివేపాకులో అనేక పోషకాలు.. కరివేపాకులో రాగి, ఖనిజాలు, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. అంతేకాదు.. అతిసారం, మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్, ఒత్తిడిని కూడా కరివేపాకు తగ్గిస్తుంది. అలాగే, శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేసి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది గాయాలు, కాలిన గాయాలు, చర్మ వ్యాధులను నయం చేసే లక్షణాలను కూడా కలిగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Also read:

Drugs: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం

Russia Ukraine Crisis Live: తగ్గేదెలే అంటున్న రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం..

Medaram Hundi: మేడారం హుండీ లెక్కింపు పూర్తి.. ఈసారి తగ్గిన ఆదాయం.. ఇంకా తేలాల్సిన బంగారం, వెండి కానుకల లెక్కలు