AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Height: మీ చిన్నారులు హైట్‌ పెరగాలనుకుంటున్నారా.? ఇలా చేస్తే ఫలితం ఉంటుంది..

Children Height: చిన్నారుల (Children) ఆరోగ్యం విషయంలో ప్రతీ పేరెంట్స్‌ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆహారం, నుంచి వారి డ్రస్‌లకు వరకు అన్నింటిలో కేర్‌ తీసుకుంటారు. ముఖ్యంగా ఎత్తు విషయంలో ముందు నుంచి ఆలోచిస్తుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్లను...

Children Height: మీ చిన్నారులు హైట్‌ పెరగాలనుకుంటున్నారా.? ఇలా చేస్తే ఫలితం ఉంటుంది..
Kids Health
Narender Vaitla
|

Updated on: Mar 05, 2022 | 6:40 AM

Share

Children Height: చిన్నారుల (Children) ఆరోగ్యం విషయంలో ప్రతీ పేరెంట్స్‌ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆహారం, నుంచి వారి డ్రస్‌లకు వరకు అన్నింటిలో కేర్‌ తీసుకుంటారు. ముఖ్యంగా ఎత్తు విషయంలో ముందు నుంచి ఆలోచిస్తుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల పౌడర్లను పాలలో కలిపి చిన్నారులకు తాగిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారికి నచ్చకపోయినా టీవీల్లో ప్రకటనలు చూసి అలవాటు చేస్తుంటారు. అయితే చిన్నారుల ఎత్తును సహజంగా పెరగాలంటే వారి డైట్‌లో కొన్ని ఆహార పదర్థాలను చేర్చితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..

  1.  పిల్లలు హైట్‌ బాగా పెరగాలంటే బెండకాయలను వారికి చిన్నప్పటి నుంచి ఇస్తుండాలి. వీటిలో ఉండే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్‌ ఎ, బి, డి, ఇలు ఎత్తు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చిన్నారులకు వీటిని అలవాటు చేస్తుండాలి.
  2.  ఆకుకూరల్లోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీర పెరుగుదలకు కావాల్సిన కాల్షియం, ప్రోటీన్లతోపాటు ఇతర ముఖ్యమైన పోషకాలు వాటిల్లో ఉంటాయి. అవి చిన్నారులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎత్తు పెరగడంలో కూడా దోహద పడుతుంది.
  3.  గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అందుకే రోజుకో గుడ్డు తినాలని చెబుతుంటారు. అయితే హైట్‌ పెరగడంలో కూడా కోడి గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. గుడ్లలో ఉండే కాల్షియం, ప్రోటీన్లు ఎత్తు పెరగడంలో దోహదపడతాయి.
  4.  మాంసాహారాలను తరచూ తీసుకోవడం వల్ల కూడా ఎత్తు పెరుగుతారు. మాంసాహారం వల్ల శరీరానికి ప్రోటీన్లు బాగా లభిస్తాయి. ఇవి కండరాల నిర్మాణానాకి దోహదం చేస్తాయి.
  5.  ఎత్తు పెరగడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం ఎక్కువగా లభించే సోయా ఉత్పత్తులను చిన్నారులకు అలవాటు చేయాలి. సోయా బీన్స్‌, సోయా మిల్క్‌ను రోజూ చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
  6.  ఇక కాల్షియం అధికంగా ఉండే వాటిలో పాలు ఒకటి ఒకటి. కాబట్టి ప్రతి రోజూ పిల్లలకు ఒక గ్లాస్‌ పాలను ఇవ్వాలి. పాలలో కాల్షియంతోపాటు విటమిన్‌ డి, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి చిన్నారులు ఎత్తు పెరిగేందుకు ఎంతగానో దోహదపడతాయి.

Also Read: Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి… క్షణంలో నోటి దుర్వాసన మాయం..వీడియో

Shane Warne Death Updates: క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం.. క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి..

Russia Ukraine Crisis: నా కొడుకు తీవ్ర గాయాలతో బతికే ఉన్నాడు.. భారత్ తీసుకురండి.. వేడుకుంటున్న హర్జీత్ తల్లిదండ్రులు