Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి… క్షణంలో నోటి దుర్వాసన మాయం..వీడియో
జీవనశైలిలో మార్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి ప్రధాన సమస్యల్లో నోటి దుర్వాస ఒకటి. జీర్ణవ్యవస్థ సరిగా జరగకపోవడం ఇతర ఆరోగ్య సమస్యల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీంతో వారు ఎవ్వరితో సరిగ్గా మాట్లాడలేరు.
జీవనశైలిలో మార్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి ప్రధాన సమస్యల్లో నోటి దుర్వాస ఒకటి. జీర్ణవ్యవస్థ సరిగా జరగకపోవడం ఇతర ఆరోగ్య సమస్యల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. దీంతో వారు ఎవ్వరితో సరిగ్గా మాట్లాడలేరు. బయటికి రావాలంటే ఇబ్బందిపడుతారు. అలాంటి వారు సహజ పద్దతుల ద్వారా నోటి దుర్వాసనని దూరం చేసుకోవచ్చు. మన వంటింట్లో దొరికే ఈ నాలుగు పదార్థాలతో నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు.నోటి దుర్వాసనకు చెక్ పెట్టడంలో లవంగాలు బాగా పనిచేస్తాయి. ఎక్కువగా వంటలలో వాడే ఇవి చక్కటి ఘాటు ఫ్లేవర్‌ని కలిగి ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. అలానే పంటి నుండి రక్తం కారడం, ఇతర సమస్యల కూడా లవంగాలతో పోగొట్టుకోవచ్చు. తరచూ వీటిని నములుతూ ఉంటే నోటి దుర్వాసన అదుపులోకి వస్తుంది. అలాగే నీళ్లు… తక్కువ నీళ్లు తీసుకునే వారిలో నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తగినన్ని మంచి నీళ్లు తాగడం ద్వారా నోటిలో ఉండే బ్యాక్టీరియా బయటకు పోయే ఆస్కారం ఉంటుంది. అందుకే నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే వెంటనే గ్లాసు నీటిలో నిమ్మరసం కలిసి తీసుకుంటే మంచిదంటున్నారు. నోటి దుర్వసనకు చెక్ పెట్టే మరో ఔషధం తేనె.. దీనికి కొద్దిగా దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే దుర్వాసన వెంటనే మాయం అవుతుంది. ఈ రెండిట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. తేనే, దాల్చిన పేస్ట్ ని నోటికి అప్లై చేసినట్లయితే దంత సమస్యలు తగ్గడంతోపాటు నోటి దుర్వాసన తగ్గుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

