Viral Video: అరుదైన వింతజీవి.. 90 ఏళ్ల తర్వాత పుట్టిన ఆర్డ్ వార్క్.. చారిత్రక ఘటన అంటున్న జూ సిబ్బంది.. (వీడియో)
యూకేలో అరుదైన వింత జీవి జన్మించింది. 90 ఏళ్ల తర్వాత పుట్టిన ఈ జీవి పెద్ద పెద్ద దొప్పల్లాంటి చెవులు కలిగి, చర్మం మొత్తం ముడతలు పడినట్టుగా ఉంది. ఇది యూకేలోని చెష్టర్ జూలోని జంతువులైన ఓనీ, కోస్‌లకు పుట్టినట్టు ఆర్డ్ వార్క్ జంతువుగా జూ టీమ్ మేనేజర్ తెలిపారు.
యూకేలో అరుదైన వింత జీవి జన్మించింది. 90 ఏళ్ల తర్వాత పుట్టిన ఈ జీవి పెద్ద పెద్ద దొప్పల్లాంటి చెవులు కలిగి, చర్మం మొత్తం ముడతలు పడినట్టుగా ఉంది. ఇది యూకేలోని చెష్టర్ జూలోని జంతువులైన ఓనీ, కోస్‌లకు పుట్టినట్టు ఆర్డ్ వార్క్ జంతువుగా జూ టీమ్ మేనేజర్ తెలిపారు. అరుదైన ఈ జంతువు తమ జూలో జన్మించడం వారికి చాలా ఆనందంగా ఉందని, దానికి అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బలం చేకూరేలా ఆహారం అందిస్తున్నామని జూ అధికారులు తమ వెబ్‌సైట్‌లో తెలిపారు. అయితే “ఇది తమ జూలో పుట్టిన తొలి ఆర్డ్‌వార్క్ అని, ఇది చరిత్రాత్మక ఘటన అని, ఈ విషయమై తాము వేడుకలు జరుపుకుంటామని జూ టీమ్ మేనేజర్ తెలిపారు.కాగా.. ఇవి రాత్రివేళ అడవిలో తిరిగే వన్యప్రాణులు. ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ జీవులు అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు పెరిగిపోవడంతో… వీటి మనుగడ కష్టమైపోతోంది. మిగతా జంతువుల లాగే వీటిని కూడా మాంసం కోసం వేటాడుతుంటారట. ప్రస్తుతం యూరప్ దేశాల్లోని జూలలో ఇవి 66 మాత్రమే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూలలో 109 మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఈ జంతువులు పందిని పోలినట్లు ఉంటాయి. పొడవైన ముక్కు ఉండే ఈ జంతువులు… చీమలు, చెదపురుగుల్ని తింటూ బతుకుతాయి. భూమిలో కన్నాలు పెట్టి ఆ బొరియల్లో నివసిస్తూ ఉంటాయి. వీటి సంఖ్యను పెంచేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించట్లేదంటున్నారు జూ సిబ్బంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

