AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D Deficiency: విటమిన్ డీ లోపంతో మరింత ప్రమాదం.. ఈ వ్యాధులు చుట్టేస్తాయి జాగ్రత్త..

Vitamin D Deficiency Causes: విటమిన్ డీ లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. శీతాకాలంలో శరీరానికి సూర్య కాంతి చాలా తక్కువగా అందుతుంది. ఎండ తక్కువగా వస్తుంటుంది. అందుకే ఎక్కువగా

Vitamin D Deficiency: విటమిన్ డీ లోపంతో మరింత ప్రమాదం.. ఈ వ్యాధులు చుట్టేస్తాయి జాగ్రత్త..
Vitamin D Deficiency Sympto
Shaik Madar Saheb
|

Updated on: Dec 28, 2021 | 12:06 PM

Share

Vitamin D Deficiency Causes: విటమిన్ డీ లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. శీతాకాలంలో శరీరానికి సూర్య కాంతి చాలా తక్కువగా అందుతుంది. ఎండ తక్కువగా వస్తుంటుంది. అందుకే ఎక్కువగా విటమిన్ డీ లోపం బారిన పడుతుంటారు. శీతాకాలంలో శరీరానికి ముఖ్యమైన విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి పలు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. విటమిన్ డి గురించి మాట్లాడితే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మాత్రమే కాదు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్ డి శరీరంలోని ఇతర వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎముకలు, కండరాలు, దంతాలను ఆరోగ్యంగా బలంగా చేస్తుంది. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది సూర్యరశ్మిని పొందలేకపోతున్నారు. దీని కారణంగా వారి రోగనిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతింటుంది.

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు కోవిడ్ ప్రమాదం రెట్టింపు అవుతుంది. కావున రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి పలు పద్ధతులను అనుసరించాలని ప్రజలకు సలహా ఇస్తున్నారు నిపుణులు. విటమిన్ డి లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులు, పలు సమస్యలకు మనల్ని వెంటాడుతాయి. ఆ వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకోండి.

విటమిన్ డి లక్షణాలు విటమిన్ డీ లోపం ఉంటే.. బాధిత వ్యక్తికి టెన్షన్, కీళ్ల నొప్పులు, అలసట, గాయాల బాధ పెరగడం లాంటి సమస్యలు మొదలవుతాయి. అంతే కాకుండా బద్దకం, మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు బాధిత వ్యక్తి వైద్యుడిని సంప్రదించడం మేలు.

జలుబు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ డి లేకపోవడం వల్ల, జలుబు సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. అంతే కాదు సీజనల్ వ్యాధులకు ముందు కూడా జలుబు వస్తుంది. ఈ వ్యాధి సాధారణమే అయినప్పటికీ.. ఈ కోవిడ్ యుగంలో, జలుబు సమస్య పెద్ద సమస్యగా మారుతుంది.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విటమిన్ డి లోపం వల్ల తరచుగా బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. ఈ వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడమే మన రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమైన పని. ఇలాంటి పరిస్థితుల్లో మీకు విటమిన్ డి లోపిస్తే.. వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. రోగనిరోధక శక్తి క్రమంగా బలహీనపడటం ప్రారంభమవుతుంది.

రోగాలు.. అనారోగ్య సమస్యలు.. శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా లేకపోతే.. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. దీని కారణంగా మీరు ప్రతిరోజూ అనారోగ్యంతో బాధపడే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని లోపాన్ని అనేక విధాలుగా ఎదుర్కొనవచ్చు. దీనిలో సూర్యకాంతి పొందడం ముఖ్యం. దీనితో పాటు మీరు అనేక రకాల పండ్లు, కూరగాయలను కూడా తినాలి. వీటిల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

మధుమేహం – అధిక రక్తపోటు.. రక్తంలో చక్కెర అధికంగా ఉంటే రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. నివేదికల ప్రకారం.. రక్తంలో అధిక చక్కెర సమస్య విటమిన్ డి లేకపోవడం వల్ల సంభవిస్తుంది. ఈ విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ బారిన పడవచ్చు. డయాబెటిక్ రోగుల రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది.

Also Read:

AP Crime News: ఏపీలో దారుణం.. కౌన్సిలింగ్‌కు పిలిచి బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం..

Credit Card Fraud: తిరిగిచ్చేసిన క్రెడిట్ కార్డులతో జల్సా.. మోసాలకు పాల్పడుతున్న బ్యాంకు ఉద్యోగి అరెస్ట్..