AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hypertension: ఢిల్లీలో పెరుగుతున్న హైపర్ టెన్షన్‌ బాధితులు..! ఎందుకో తెలుసా..?

Hypertension: దేశ రాజధాని ఢిల్లీలో 33 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య జాతీయ సగటు కంటే దాదాపు 9 శాతం ఎక్కువ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Hypertension: ఢిల్లీలో పెరుగుతున్న హైపర్ టెన్షన్‌ బాధితులు..! ఎందుకో తెలుసా..?
World Hypertension
uppula Raju
|

Updated on: Nov 27, 2021 | 9:28 PM

Share

Hypertension: దేశ రాజధాని ఢిల్లీలో 33 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య జాతీయ సగటు కంటే దాదాపు 9 శాతం ఎక్కువ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటాలో ఈ సమాచారం వెలువడింది. డేటా ప్రకారం.. రాజధానిలో మహిళల్లో అధిక రక్తపోటు సంఖ్య 24.1 శాతం. రక్తపోటు ఉన్న ప్రతి వ్యక్తి దీనిని నియంత్రించడానికి మందులు వాడుతున్నారు. దాదాపు 42 శాతం మంది మహిళలు, 38 శాతం మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు.

గత సర్వేతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 4 శాతం పెరిగింది. ఆహారంపై శ్రద్ధ పెట్టకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం వల్లే ఈ వ్యాధి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి చికిత్స చేయకపోతే గుండె, మూత్రపిండాలతో సహా అనేక అవయవాలు దెబ్బతింటాయి. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వ్యక్తి రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మరణ ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది. రోగి రక్తపోటును నియంత్రించడానికి మందుల సహాయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది నియంత్రణలో లేకపోతే, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, చాలా సందర్భాలలో మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఎక్కువ స్థూలకాయం ఉన్నవారు, ఎక్కువ ఒత్తిడిని తీసుకునేవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.

ఇవి లక్షణాలు 1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 2. అలసినట్లు అనిపించడం 3. తలతిరగడం 4. ఆకస్మిక తలనొప్పి

ఇలా రక్షించుకోండి 1. ఆహారంపై శ్రద్ధ వహించండి. పండ్లు, కూరగాయలను చేర్చండి 2. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి 3. మద్యం వినియోగం నియంత్రించండి 4. ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినవద్దు

అర్ధరాత్రి వరకు మొబైల్‌ స్క్రీన్‌ చూస్తున్నారా.. అయితే ఆ కోరికలు పెరుగుతున్నాయట..!

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Chocolates: ఈ దేశ ప్రజలు చాక్లెట్ అంటే చెవి కోసుకుంటారు..! ఎందుకో తెలుసా..?