Potato Peel Benefits: బంగాళదుంప తొక్కను ఇలా చేయండి.. కొవ్వు కరిగించుకోండి!!

మనం వంటకు ఉపయోగించే కూరగాయల్లో.. కొన్నింటిని వాటిపై ఉన్న తొక్కను తీసేసి వాడుతుంటాం. వాటిలో బంగాళా దుంప ఒకటి. బంగాళ దుంపలతో తయారు చేసే ఏ వంటకమైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ ఫ్రై, ఆలూ మసాలా కర్రీ, ఆలూ-టమాటా కర్రీ ఇలా రకరకాలుగా వండుకుంటాం. బంగాళ దుంపను ఇష్టపడని వారు చాలా తక్కువగా ఉంటారు. దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తినే బంగాళాదుంపలే కాదు.. వాటి తొక్కల్లోనూ ఔషధ గుణాలున్నాయి..

Potato Peel Benefits: బంగాళదుంప తొక్కను ఇలా చేయండి.. కొవ్వు కరిగించుకోండి!!
Potato Peel
Follow us
Chinni Enni

|

Updated on: Aug 25, 2023 | 9:16 PM

మనం వంటకు ఉపయోగించే కూరగాయల్లో.. కొన్నింటిని వాటిపై ఉన్న తొక్కను తీసేసి వాడుతుంటాం. వాటిలో బంగాళా దుంప ఒకటి. బంగాళ దుంపలతో తయారు చేసే ఏ వంటకమైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ ఫ్రై, ఆలూ మసాలా కర్రీ, ఆలూ-టమాటా కర్రీ ఇలా రకరకాలుగా వండుకుంటాం. బంగాళ దుంపను ఇష్టపడని వారు చాలా తక్కువగా ఉంటారు. దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తినే బంగాళాదుంపలే కాదు.. వాటి తొక్కల్లోనూ ఔషధ గుణాలున్నాయి.

బంగాళ దుంప తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ బారిన పడకుండా సహాయపడుతాయి. వీటిలో ఉంటే పొటాషియం రక్త పోటును అదుపులో ఉంచుతుంది. బంగాళదుంప తొక్కలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. మరి బంగాళాదుంపలను తొక్కతో సహా తినలేం కదా. తొక్కలో ఉండే పోషకాలు కూడా పొందాలంటే వాటినెలా పొందాలో తెలుసుకుందాం.

బంగాళ దుంపలను తొక్కతో సహా బాగా కడగాలి. బంగాళాదుంపల నుంచి తొక్కను వేరుచేసి ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను ఒక గ్లాస్ నీటిలో వేసి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి. ఇందులో రుచికోసం 1 టీ స్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు. ఇలా బంగాళదుంప తొక్కలతో చేసిన నీటిని తాగడం వల్ల అధిక బరువు కూడా తగ్గొచ్చు.

ఇవి కూడా చదవండి

వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సహాయపడుతాయి. తొక్కలను పేస్ట్ చేసి గాయాలపై లేపనంగా రాస్తే.. అవి త్వరగా మానిపోతాయి. బంగాళాదుంప తొక్క‌ల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ నీటిని తాగితే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

బంగాళదుంప తొక్కల పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకుని.. ఈ పేస్ట్ లో ముల్తానీ మట్టి లేదా, గంధం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే.. మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి.. ముఖం నిగారింపు పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి