Hiccups Straw: వెక్కిళ్లకు చెక్ పెట్టిన యూఎస్ శాస్త్రవేత్తలు.. అతి చిన్న పరికరంతోనే సులభంగా సమస్య దూరం..
సాధారణంగా.. మనకు వెక్కిళ్లు కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంటాయి. కానీ కొందరికి మాత్రం నిరంతరం వెక్కిళ్లూ వస్తూనే ఉంటాయి. నీళ్లు తాగితే వెక్కిళ్లు తగ్గిపోతుంటాయి. అలా కూడా ఆగకుంటే..
సాధారణంగా.. మనకు వెక్కిళ్లు కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంటాయి. కానీ కొందరికి మాత్రం నిరంతరం వెక్కిళ్లూ వస్తూనే ఉంటాయి. నీళ్లు తాగితే వెక్కిళ్లు తగ్గిపోతుంటాయి. అలా కూడా ఆగకుంటే.. నిమ్మకాయ, అల్లం ముక్క నమలడం వంటి చిట్కాలను పాటిస్తారు. అప్పుడు కూడా వెక్కిళ్లు తగ్గకపోతే.. డాక్టరును సంప్రదిస్తారు. అయితే అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు మాత్రం వెక్కిళ్లు ఆపడం కోసం ప్రత్యేకంగా ఓ చిన్నపాటి పరికరాన్ని తయారు చేశారు. దాని పేరు “ద ఫోర్స్డ్ ఇన్స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్ “. ఇది చూడటానికి ఎల్ షేప్లో ఉంటుంది. దీంతో నీళ్లను తాగితే చిటికలోనే వెక్కిళ్లు మాయమైపోతాయట. అదెలాగో తెలుసుకుందామా.
అమెరికాలోని శాన్ ఆంటోనియోలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అలీ సీఫీ సహ రచయిత.. జామా నెట్వర్క్లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఎల్ ఆకారంలో ఉన్న ద ఫోర్స్డ్ ఇన్స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్ 92 శాతం వెక్కిళ్ల సమస్యను నయం చేస్తుందని తెలీంది. ఇందులో 90 శాతం మంది ఇంట్లో ఉపయోగించే నివారణల కంటే ఈ పరికరం ఎక్కువగా పనిచేసిందని వారు పేర్కోన్నారు. ఈ అధ్యయనంలో 203 మంది పాల్గోనగా.. వారిలో 183 మందిపై ఈ పరికరం మంచి ఫలితాలను ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఈ పరికరం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీనిని పిల్లలు, పెద్దవారు అందురూ ఉపయోగించవచ్చని.. దీని ద్వారా 9 లేదా 14 సిప్స్ తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం వివిధ కంపెనీల వారు నీలం, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో వీటిని తయారు చేస్తున్నారు. అయితే ధర సుమారు రూ. 1000 నుంచి రెండు వేలకు పైగా ఉంటుంది.
Also Read: Pooja Bhatt: తాగుడుకు బానిసయ్యాను.. అందుకు పోరాటమే చేశా.. హీరోయిన్ పూజాభట్ సంచలన కామెంట్స్..