AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే పసుపు ఇలా తినండి.. తాగండి.. తప్పక ఫలితం ఉంటుంది..

పసుపు ఉపయోగించడం వల్ల డయాబెటిస్‌కు చెక్ పెట్టడమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.. పసుపులో ఉండే ఫెనోల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఒబెసిటీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని..

Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే పసుపు ఇలా తినండి.. తాగండి.. తప్పక ఫలితం ఉంటుంది..
Turmeric Benefits
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2022 | 7:55 PM

Share

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఈజీగా బరువు తగ్గే మార్గం మీ కిచెన్ షెల్ఫ్‌లోనే ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో పసుపు ఒకటి. కానీ పసుపు మసాలాగా కాకుండా బరువు తగ్గడంలో సహాయపడే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉందంటే మీరు నమ్మలేరు కదా..! కానీ, ఇది నిజమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి పసుపును తీసుకోవడం మంచిది. పసుపులో కర్కుమినాయిడ్స్, హెపటోమెట్రిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అదే సమయంలో ఊబకాయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్థూలకాయముండేవారికి సాధారణంగా డయాబెటిస్ ముప్పు ఉంటుంది. పసుపు ఉపయోగించడం వల్ల డయాబెటిస్‌కు చెక్ పెట్టడమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలుగుతుంది.. పసుపులో ఉండే ఫెనోల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఒబెసిటీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వైట్ ఎడిపోజ్ టిష్యూలో వాపు తగ్గించేందుకు పనిచేస్తాయి. అందుకే పసుపు వివిధ రకాలుగా సేవించడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతారని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

తేనెతో పసుపు టీ: తేనెతో పసుపు టీ బరువు తగ్గించేందుకు సహయపడే ఓ గొప్ప పానీయం. తేనె ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ఎఫెక్టివ్‌గా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్కతో పసుపు టీ: దాల్చిన చెక్క బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. పసుపు టీలో కొంచెం దాల్చిన చెక్కను జోడించడం వల్ల బరువు తగ్గడానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అల్లంతో పసుపు టీ: యాంటీఆక్సిడెంట్లు, మూలికల గొప్ప మూలం, అల్లం బరువు తగ్గడానికి గొప్పది. తరిగిన అల్లం వేసి నీటిని మరిగించాలి. తరవాత అందులో కాస్త పసుపు వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఈ పానీయం వడకట్టవచ్చు..లేదంటే అలాగే తాగేయవచ్చు. దీన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అల్లం ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

పసుపు పాలు: పాలలో కొద్దిగా పసుపు కలుపుకోవడం బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది జలుబు మరియు దగ్గుకు వ్యతిరేకంగా మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి