AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నివాస భవనంలో రాకెట్‌ పేల్చిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

దీపావళి రోజున పటాకులు పేల్చకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. పటాకులతో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. అయితే ఇక్కడ ఎవరో ఒకరు నివాస భవనంలోకి రాకెట్‌ను వదిలారు.

నివాస భవనంలో రాకెట్‌ పేల్చిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూస్తే షాక్‌ అవుతారు..
Horrific Scene
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2022 | 7:34 PM

Share

దీపావళి వెంటేనే వెలుగుల పండుగ. తమ జీవితాల్లో కష్టాలు తొలగిపోయి వెలుగులు రావాలంటూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు ప్రజలు. లక్ష్మిదేవికి పూజలు చేస్తారు. సాయంత్రం ఇళ్లముందు దీపాలు వెలిగిస్తారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. వెలుగుల పండుగ ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఇతరులకు హాని కలిగించకూడదని ఢిల్లీలో ప్రభుత్వం బాణాసంచా నిషేధించింది. దీపావళి రోజున పటాకులు పేల్చకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. పటాకులు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. అయితే ఇక్కడ ఎవరో ఒకరు నివాస భవనంలోకి రాకెట్‌ను వదిలారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గాల్లో రయ్‌మంటూ దూసుకొచ్చింది రాకెట్‌. దాంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్టుగా తెలిసింది. థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుడు పలు రాకెట్లను అపార్ట్‌మెంట్‌ వైపు విసరటంతో అవి అపార్ట్‌మెంట్‌ వాసుల బాల్కనీలోకి దూసుకొచ్చాయి. ఈ ఘటన ఉల్హాస్‌నగర్‌లో కలకలం రేపింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బిల్డింగ్‌ వెలుపల చేతిలో రాకెట్లతో నిల్చుని ఉండటం కనిపించింది.

ఇవి కూడా చదవండి

పటాకులను పేల్చగానే దివాళీ రాకెట్లు అపార్ట్‌మెంట్‌ కిటికీలు, బాల్కనీల్లో గుండా నేరుగా ఇండ్లలోకి దూసుకెళ్లడం కనిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో థానే పోలీసులు గుర్తుతెలియని యువకుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువకుడు నివాస భవనం కింద నిలబడి రాకెట్ కాల్చడం మీరు చూడవచ్చు. ఈ రాకెట్లు మరొక బ్లాక్‌లోని ప్రజల ఇళ్లలోకి దూసుకెళ్లింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం సదరు వ్యక్తి చర్యకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు కావాలనే ఇలా చేశాడంటూ మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి