AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో విచిత్ర ప్రేమకథా చిత్రం..19 ఏళ్ల అబ్బాయికి 56 ఏళ్ల మహిళతో నిశ్చితార్థం.. త్వరలోనే వివాహం..

10 ఏళ్ల బాలుడిగా కలిశాడు. అప్పట్లో వీరిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలోనే నివసించేవారు.. ఇంటి పనుల్లో, ఇంటిని శుభ్రం చేయడంలో ఆమెకు సహాయం చేయడంతో పరస్పర స్నేహం ఏర్పడింది. తర్వాత అది రిలేషన్‌షిప్‌గా మారింది. ఇప్పుడు..

ఇదో విచిత్ర ప్రేమకథా చిత్రం..19 ఏళ్ల అబ్బాయికి 56 ఏళ్ల మహిళతో నిశ్చితార్థం.. త్వరలోనే వివాహం..
Marriage
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2022 | 6:00 PM

Share

19 ఏళ్ల అబ్బాయి,56 ఏళ్ల మహిళ నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమకు హద్దులు లేవు, కారణం లేదు, వయసుతో అసలు సంబంధమే లేదు.. అనే మాటలకు ఉదాహరణగా వీరిద్దరూ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఈ టీనేజ్ కుర్రాడికి, వృద్ధురాలికి మధ్య వయసు అంతరం సుమారు 37 సంవత్సరాలు. ప్రపంచం మొత్తం ఈ జంటను ఆశ్చర్యంగానూ, వింతగానూ చూస్తోంది. ఇలాంటి షాకింగ్‌ ప్రేమ పెళ్లి ఉదాంతం థాయ్‌లాండ్‌లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

19 ఏళ్ల వుతిచాయ్ చంత్రాజ్ 56 ఏళ్ల జన్లా నాముంగ్రాక్ అనే ఈ మహిళను 10 ఏళ్ల బాలుడిగా కలిశాడు. అప్పట్లో వీరిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలోనే నివసించేవారు.. ఇంటి పనుల్లో, ఇంటిని శుభ్రం చేయడంలో ఆమెకు సహాయం చేయడంతో పరస్పర స్నేహం ఏర్పడింది. తర్వాత అది రిలేషన్‌షిప్‌గా మారింది. ఇప్పుడు గత రెండేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వూటిచాయ్‌ని ఎవరైనా నిలదీసి నీ జీవితం ఎలా ఉంది అడగ్గా..హాయిగా ఉన్నాను..అంటూ సమాధానం ఇస్తున్నాడు. నా జీవితంలో మొదటిసారి హాయిగా జీవిస్తున్నాను అని చెబుతున్నాడు. రెండేళ్లుగా జన్లతో సహజీవనం చేస్తున్నాను. నేను ఆమెను తుంగ్ అని పిలుస్తాను అని వుతిచాయ్ చెప్పారు.

Thailand Boy

ఇవి కూడా చదవండి

ఆమె మర్యాద, నిజాయితీపరురాలు అందుకే, ఆమె నాకు నచ్చింది అని చెబుతున్నాడు.. కానీ, కష్టాల్లో ఉన్న ఆమె ఇంటిని చూసి బాధగా ఉంది. మొత్తంమీద ఆమె మెరుగైన జీవితాన్ని గడపాలి. ఆమెకు సహాయపడే మార్గాల గురించి ఆలోచిస్తున్నాను అని వుతిచాయ్ చెప్పారు. వారిద్దరూ తమ వయస్సు అంతరం గురించి పట్టించుకోవటం లేదు. అంతేకాదు.. బహిరంగంగా కలిసి తిరిగేందుకు కూడా ఇబ్బంది పడటం లేదు. డేటింగ్‌కు వెళుతున్నప్పుడు పట్టణ వీధుల్లో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ముద్దులు పెట్టుకున్నారు.

19 Year Old Thailand Boy Ge

ఇదిలా ఉంటే, జన్లా గతంలో విడాకులు తీసుకున్నారు. ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వుతిచాయ్, నన్ను మళ్లీ యవ్వనంగా మార్చేశాడు.. అతను నాకు సూపర్ హీరో లాంటివాడు. అతను నాకు ఎన్నో విధాలుగా సహాయం చేసేవాడు. అతను యుక్తవయసులోకి వచ్చే క్రమంలోనే నా పట్ల ప్రేమను పెంచుకున్నాడని, కానీ, తనకు అప్పట్లో ఆశ్చర్యం వేసిందని చెప్పింది. అతడు తనకు చిన్ననాటి నుంచి తెలుసునని చెప్పింది. ఇప్పుడు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అంటోంది జాన్లా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి