తీవ్ర గాయాలతో పడివున్న 13 ఏళ్ల బాలిక.. స్థానికుల రియాక్షన్‌పై నెటిజన్స్‌ ఫైర్‌..!

తలకు తీవ్రమైన గాయాలతో ఒళ్లంతా రక్తపు మరకలతో చిన్నారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

తీవ్ర గాయాలతో పడివున్న 13 ఏళ్ల బాలిక.. స్థానికుల రియాక్షన్‌పై నెటిజన్స్‌ ఫైర్‌..!
Injured Up Girls
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 25, 2022 | 4:35 PM

కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే..మనుషుల్లో మానవత్వం నశించిపోయిందనే భయం కలుగుతుంది. అలాంటి అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో ఒక ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ పక్కన పడివుంది. తలకు తీవ్రమైన గాయాలతో ఒళ్లంతా రక్తపు మరకలతో చిన్నారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. కానీ,ఇంత జరిగినా అక్కడి జనం మాత్రం చోద్యం చూస్తున్నట్టుగా ప్రవర్తించారు. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. కనీసం పోలీసులకు సైతం ఫోన్‌ చేయాలనే ఆలోచన కూడా ఎవరూ చేయలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడిన చిన్నారి సహాయం కోసం వేడుకుంటున్నా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు.. రక్తపు మడుగులో పడివున్న బాలికను స్థానికులు వీడియో తీశారు. సాయం కోసం బాలిక అర్థిస్తున్నా పట్టించుకోకుండా.. వీడియో రికార్డింగ్‌లో పోటీపడ్డారు.

యూపీలోని కన్నౌజ్‌లో జరిగింది ఈ దారుణ ఘటన. ఎలాగోలా విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. వచ్చిరావడంతో ఓ పోలీస్‌ ఆ బాలికను చేతులపై ఎత్తుకుని ఆటోవైపు పరుగెత్తాడు. ఆటోలో వేసుకుని ఆస్పత్రికి తరలించాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ప్రకారం పోలీసులు వచ్చే వరకు బాధితురాలికి ఎవరూ సాయం చేయలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలికను చికిత్స కోసం కాన్పూర్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

కానీ, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మొబైల్‌లో వీడియోలు తీస్తున్నవారిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సాయం చేసిన పోలీసులకు సెల్యూట్‌ అంటూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి