అధికార మధమో, అహంకారమో.. దీపావళి వేళ వీధి వ్యాపారుల ఉసురు పోసుకుంది.. షాకింగ్ వీడియో..
పోలీసులు ట్విట్టర్‌లో ఈ వీడియోను గమనించి, ఈ మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమార్తెగా గుర్తించారు.
దేశం మొత్తం దీపావళి సంబరాలతో సందడి నెలకొంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గోమతి నగర్‌లో జరిగిన ఘటన మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూతురు రోడ్డు పక్కన ఉన్న మట్టి ప్రమిదల దుకాణాన్ని ధ్వంసం చేసిన వీడియో వైరల్ అవుతోంది. లక్నో పోలీసులు ట్విట్టర్‌లో ఈ వీడియోను గమనించి, ఈ మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వృత్తిరీత్యా వైద్యురాలు, ఆమె రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శంకర్ లాల్ కుమార్తెగా గుర్తించారు. గోమతీనగర్‌లోని పాత్రకర్‌పురంలోని ఆమె ఇంటి ముందు వీధి వ్యాపారులు మట్టి బొమ్మలు, ప్రమిదలు విక్రయిస్తుండడం ఆమెకు కోపం తెప్పించింది. దాంతో ఆమె తన విశ్వరూపం చూపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఓ మహిళ ఆగ్రహంతో ఊగిపోతూ..శివంగిలా రెచ్చిపోయింది. చేతిలో దుడ్డుకర్ర పట్టుకుని వీధి వ్యాపారుల సామాగ్రినంతా పగులగొడుతూ విధ్వంసం చేసింది. అయితే, షాపులను తొలగించాలని దుకాణాల యజమానులను ఆమె ముందుగానే కోరిందిట. అయితే అందుకు వారంతా సమయం కావాలని అడిగారు. అందుకు ఆ మేడం అంగీకరించలేదు. వ్యాపారులు విక్రయిస్తున్న మట్టి బొమ్మలు, ప్రమిదలపై మొదట నీళ్లు పోసింది. ఆపై ఓ కర్ర తీసుకుని వాటన్నింటినీ నాశనం చేసింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయాన్నే షాపులు క్లియర్ చేయమని మేడమ్ చెప్పింది నిజమేనన్నారు వర్తకరులు.. కాస్త సమయం ఇవ్వండి, ఏదైనా వాహనంలో ఎక్కించుకుని మరో చోటికి తరలిస్తామని చెప్పారట. కానీ, అందుకు మేడమ్ ఒప్పుకోలేదని వ్యాపారులు వాపోయారు. దీంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యాంతమయ్యారు.
Several videos of a woman vandalising potteries of road side vendors in posh Patrakarpuram area in UP’s Lucknow has surfaced. Request @lkopolice take cognizance. pic.twitter.com/4YKocXiaxj
— Piyush Rai (@Benarasiyaa) October 24, 2022
ఇక వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల బాధలు ఉన్నత వర్గాలకు అర్థం కావడం లేదు. ఈ నష్టాలన్నీ ఆమె భరిస్తుందా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వృత్తి రీత్యా రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్, ఓ ఐఏఎస్ అధికారి కూతురిగా ఉండి ఇలాంటి దారుణానికి పాల్పడినందుకు నెటిజన్లు మండిపడుతున్నారు.వీడియోలో పక్కన ఉన్నవాళ్లు నిలబడి తమాషా చూస్తున్నారు..వాళ్ల ముందు ఏం జరుగుతుందో సినిమాలా ఉందనుకుంటున్నారా..? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంమీద, చాలా మంది ఈ చర్యను ఖండించారు. ఈ వీధి వ్యాపారికి సహాయం చేయడానికి ఆసక్తిని కనబరిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి