WhatsApp: గ్రహణం వీడిన వాట్సాప్.. ఊపిరి పీల్చుకున్న వినియోగదారులు..
వాట్సప్ కు గ్రహణం వీడింది. దాదాపు గంటన్నర తర్వాత వాట్సప్ తన సేవలను పునరుద్దరించింది. మద్యాహ్నం 12.30 గంటల నుంచి

వాట్సప్ కు గ్రహణం వీడింది. దాదాపు గంటన్నర తర్వాత వాట్సప్ తన సేవలను పునరుద్దరించింది. మద్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సప్ సర్వర్ డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో వాట్సప్ సందేశాలకు బ్రేక్ పడింది. చాలా మంది ఈ విషయమై సదరు సంస్థ లక్షలాది ఫిర్యాదులు సైతం వెళ్లాయి. వెంటనే రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది సేవలు నిలిచిపోవడానికి గల కారణాలు తెలుసుకుని, సమస్యను పరిష్కరించడంతో సుమారు మద్యాహ్నం 2.00 గంటల తర్వాత నుంచి వాట్సప్ సందేశాలు వెళ్లడం ప్రారంభించాయి. దీంతో వాట్సప్ వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఒక సారిగా వాట్సప్ సేవలకు అంతరాయం కలగడంతో ఎవరైనా హ్యాక్ చేశారా అనే అనుమానాలు తలెత్తాయి. మరోవైపు వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో ఈ రోజు దేశంలోని కొన్ని చోట్ల సూర్య గ్రహణం కావడంతో.. వాట్సప్ కు గ్రహణం పట్టిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి కొన్ని సాంకేతిక కారణాలతో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. అయితే హ్యాకింగ్ కు అవకాశం లేదని నిపుణులు వెల్లడించారు. కాన్ఫిగిరేషన్ సమస్య తలెత్తి ఉండవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద 90 నిమిషాల తర్వాత వాట్సప్ సేవలు తిరిగి ప్రారంభం కావడంతో సమస్య పరిష్కారం అయినట్లు అయింది. ఇటీవల కాలంలో వాట్సప్ సేవలకు ఇంత సేపు అంతరాయం కలిగిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా సమస్య ఏర్పడిన ఒకటి, రెండు నిమిషాలు మినహాయిస్తే అంతకు మించి ఉండేది కాదు. తాజాగా 90 నిమిషాల పాటు వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో తమ డేటా ఏమైనా చోరికి గురువుతుందా, ఎవరైనా హ్యాకింగ్ కు పాల్పడ్డారా అనే అనుమానాలు తలెత్తాయి. వాట్సప్ సంస్థ మాత్రం ఈ సమస్యపై అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మేటా సంస్థ ఈ వాట్సప్ సేవలను అందిస్తోంది. సేవలు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడంతో మేటా సంస్థ వాట్సవ్ సేవలను పునరుద్దరించింది.
వాట్సప్ సేవలకు అంతరాయం ఎప్పటినుంచి అంటే..
దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు మద్యాహ్నం 12.30 నిమిషాల సమయంలో నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెసేజ్ డెలివరీ స్టేటస్‌ను వాట్సాప్ చూపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. వాట్సాప్‌లో డబుల్ టిక్ , బ్లూటిక్ మార్కులు చూపించడం లేదు. దీంతో యూజర్లు మేటా కంపెనీకి ఫిర్యాదులు చేశారు. గతంలో కూడా వాట్సాప్ సర్వర్ పలుమార్లు డౌన్ అయిన విషయం తెలిసిందే.
భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ నెట్‌వర్క్ మధ్యాహ్నం 12.30 నుంచి కుప్పకూలింది. వినియోగదారులు గ్రూప్ చాట్‌లకు సందేశాలను పంపలేకపోతుండటం.. వ్యక్తులకు పంపిన సందేశాలకు ఒక టిక్ మాత్రమే చూపిస్తుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా వ్యాట్సప్ నెట్‌వర్క్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు నివేదించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..