AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్‌ రిపేర్‌ చేస్తుండగా పేలుడు.. ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డ మంటలు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

ఛార్జింగ్ సమస్య కారణంగా ఓ కస్టమర్ రిపేర్ కోసం ఫోన్ తీసుకొచ్చినట్టుగా తెలిసింది. అయితే, దుకాణదారుడు బ్యాటరీని బయటకు తీసిన కొద్ది క్షణాలకే మొబైల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో..

మొబైల్‌ రిపేర్‌ చేస్తుండగా పేలుడు.. ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డ మంటలు..  షాకింగ్‌ వీడియో వైరల్‌
Phone Explodes
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2022 | 6:34 PM

Share

రిపేర్‌ చేస్తున్న మొబైల్ ఫోన్ బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో దుకాణదారుడు, వినియోగదారుడు తృటిలో సురక్షితంగా బయటపడ్డారు. ఛార్జింగ్‌లో సమస్య రావడంతో రిపేర్‌ కోసం మొబైల్‌ తీసుకొచ్చినట్టుగా తెలిసింది. కానీ రిపేరింగ్‌ ప్రక్రియలో మొబైల్ బ్యాటరీని తీసివేసిన తర్వాత సెకన్లలోనే బ్యాటరీ పేలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో జరిగినట్టుగా తెలిసింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు సైతం షాక్‌ అవుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లోని పాలి ప్రాంతంలో గల రిపేర్ షాపులో ఛార్జింగ్ సమస్య కారణంగా ఓ కస్టమర్ రిపేర్ కోసం ఫోన్ తీసుకొచ్చినట్టుగా తెలిసింది. అయితే, దుకాణదారుడు బ్యాటరీని బయటకు తీసిన కొద్ది క్షణాలకే మొబైల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణదారుడు, వినియోగదారుడు తృటిలో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంతా షాపులోని సీసీటీవీలో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక యువకుడు దుకాణంలోని గ్లాస్ కౌంటర్‌కు ఒక వైపు నిలబడి, అతని ఫోన్ కౌంటర్‌పై ఉంచడం చూడవచ్చు. రిపేర్ చేసే వ్యక్తి ఒక టూల్‌తో మొబైల్‌లోని బ్యాటరీని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు, ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ఒక సెకనులో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను చూసి దుకాణదారులు, కస్టమర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో మొబైల్‌లోని బ్యాటరీని తీసి తనిఖీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుకాణదారుడు మహేష్ చౌరాసియా తెలిపారు. కానీ పేలుడు సమయంలో అతను చాకచక్యంగా వ్యవహరించి దూరం వెళ్లాడు కాబట్టి పెను ప్రమాదం తప్పిందని చెప్పాడు. అగ్నిప్రమాదం నుంచి కస్టమర్‌ కూడా తృటిలో తప్పించుకున్నాడు. పాలీ పోలీస్‌స్టేషన్‌ పట్టణ ఇన్‌చార్జి సియారామ్‌సింగ్‌ ఆద్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి