AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీ పిల్లలు పాలు ఇష్టంగా తాగేందుకు ఇలా ట్రై చేయండి.. అడిగి మరీ తాగేస్తారు..

చాలా మంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. తల్లిదండ్రుల్ని ఇబ్బందిపెడుతుంటారు. అలా పాలంటే పరిగెత్తె పిల్లలు ఇష్టంగా అడిగేలా చేసేందుకు..కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ పిల్లలు పాలను ఇష్టంగా తాగేస్తారు.

Health Tips: మీ పిల్లలు పాలు ఇష్టంగా తాగేందుకు ఇలా ట్రై చేయండి.. అడిగి మరీ తాగేస్తారు..
Milk
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2022 | 7:00 PM

Share

Health Tips: పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. పాలలో శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చిన్న పిల్లలకు తప్పనిసరిగా పాలు తాగిస్తుంటారు. అయితే చాలా మంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. తల్లిదండ్రుల్ని ఇబ్బందిపెడుతుంటారు. అలా పాలంటే పరిగెత్తె పిల్లలు ఇష్టంగా అడిగేలా చేసేందుకు..కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ పిల్లలు పాలను ఇష్టంగా తాగేస్తారు. పాలను రుచికరంగా చేయడానికి కొన్ని పద్ధతులను పాటిస్తే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పాలు, ఖర్జూరాలు ఖర్జూరం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి ప్రధాన పోషకాలు ఖర్జూరం లోపల పుష్కలంగా లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు పిల్లలకి పాలలో ఖర్జూరాన్ని కలిపితే, అది పిల్లల ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. 5-6 ఖర్జూరాలను నీటిలో నానబెట్టి ఆ తర్వాత దాని గింజలను తీసి ఖర్జూరాలను మెత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని పాలలో కలిపి వాటిని పిల్లలకు ఇవ్వండి.. ఇష్టంగా తాగేస్తారు.

పాలు, ఏలకులు ఏలకులు రుచిగా ఉండటమే కాకుండా మంచి సువాసన కలిగి ఉంటాయి. ఏలకులు తీసుకోవడం ద్వారా పిల్లలకు కాల్షియం, ఐరన్ వంటి ప్రధాన పోషకాలు లభిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాలలో యాలకుల పొడి వేసి పిల్లలకు ఇవ్వండి. దీనివల్ల పిల్లలకు రుచిగా ఉండటమే కాకుండా అవసరమైన పోషకాలు కూడా అందుతాయి.

ఇవి కూడా చదవండి

చాక్లెట్, పాలు మీరు పిల్లలకు పాలలో చాక్లెట్ కూడా కలపవచ్చు. చాక్లెట్లు అంటే పిల్లలకు ఇష్టమే కాదు, రుచిలోనూ బాగుంటుంది. కానీ చాక్లెట్ లోపల చక్కెర చాలా ఉందని గమనించండి. అటువంటి పరిస్థితిలో, చిన్న పరిమాణంలో పాలలో చాక్లెట్ కలపండి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి