AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఒకే దగ్గర కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే మీకు డయాబెటిస్‌ రావొచ్చు..!

డయాబెటిస్‌ ఎందుకు వస్తుందో తెలుసా.. దానికి చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, వారసత్వం వంటి కారణాల వల్ల డయాబెటీస్ వస్తుందట. ఇది ఒకసారి వచ్చాకా.. పూర్తిగా నయం అవడం అంటూ జరగదు. జీవితాంతం ఈ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంతేకాదు మరువకుండా ప్రతిరోజూ గోలిలు వేసుకోవాల్సిందే. అంతేకాదు కొన్ని రకాల ఆహారలను తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధిబారిన పడిన వారు […]

Diabetes: ఒకే దగ్గర కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే మీకు డయాబెటిస్‌ రావొచ్చు..!
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: May 02, 2022 | 9:43 AM

Share

డయాబెటిస్‌ ఎందుకు వస్తుందో తెలుసా.. దానికి చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, వారసత్వం వంటి కారణాల వల్ల డయాబెటీస్ వస్తుందట. ఇది ఒకసారి వచ్చాకా.. పూర్తిగా నయం అవడం అంటూ జరగదు. జీవితాంతం ఈ వ్యాధిని ఎదుర్కోవాల్సిందే. అంతేకాదు మరువకుండా ప్రతిరోజూ గోలిలు వేసుకోవాల్సిందే. అంతేకాదు కొన్ని రకాల ఆహారలను తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఈ వ్యాధిబారిన పడిన వారు బలహీనంగా ఉండటం, అధికంగా చెమట పట్టడం, heart rate పెరుగడం, కళ్లు తిరగడం, తరచుగా అలసిపోవడం, మూత్రం ఎక్కువ సార్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ ను తాగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ డ్రింక్స్ ను తరచుగా తాగారో పక్కాగా డయాబెటీస్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్డ్ జ్యూసెస్, సోడా, సాఫ్ట్ డ్రింక్స్, తియ్యని లెమన్ వాటర్ వంటివి ఎక్కువగా తాగితే టైప్ 2 మధుమేహం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ డ్రింక్స్ లల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయట.

చెక్కెర, వైట్ రైస్, మైదా పిండి వంటి వాటివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధుమేహ ప్రమాదం ప్రాసెస్ చేసిన ఆహారాల వల్లే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. మనం తీసుకునే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్, పొట్టు వంటివి ఏవీ ఉండవని… ఇక వీటిని మితిమీరి తిన్నారో.. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి షుగర్‌ వచ్చే ప్రమాదం ఉందట. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ను తాగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఈ డ్రింక్స్ ను తరచుగా తాగారో పక్కాగా డయాబెటీస్ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేయించిన ఆహార పదార్థాలను గానీ, ప్యాకెట్ ఫుడ్స్ ను గానీ ఎక్కువగా తిన్నారో మీరు ఖచ్చితంగా షుగర్ వ్యాధి బారిన పడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Summer Tips: మండుటెండల్లో బయటకు వెళ్తున్నారా..? ఈ 5 విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి..