AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tips: మండుటెండల్లో బయటకు వెళ్తున్నారా..? ఈ 5 విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి..

Heat Stroke Protection: ఈ వేసవిలో ఎండలు రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్రమైన ఎండలు, వేడి ధాటికి ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా మారుతోంది.

Summer Tips: మండుటెండల్లో బయటకు వెళ్తున్నారా..? ఈ 5 విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి..
Summer
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 01, 2022 | 1:25 PM

Heat Stroke Protection: ఈ వేసవిలో ఎండలు రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్రమైన ఎండలు, వేడి ధాటికి ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా మారుతోంది. ఇంట్లోంచి బయటకి రాగానే ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లు అనిపిస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. చాలా మంది అవసరాల నిమిత్తం, పలు పనుల కోసం ఇంటి నుంచి బయటికి తప్పనిసరిగా వెళ్లవలసి వస్తుంది. దీని కారణంగా హీట్ స్ట్రోక్ (వడ దెబ్బ) కు గురయ్యే ప్రమాదం ఉంది. రోజురోజుకూ హీట్ స్ట్రోక్ ప్రమాదం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా వడదెబ్బ బారిన పడటంతోపాటు చాలా వ్యాధులు వస్తాయి. వేడి వల్ల చెడిపోయిన ఆహారం, కలుషితమైన వాటిని తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. మీరు ఇంటి నుంచి బయటకు వెళితే ఈ విషయాలను తప్పని సరిగా గుర్తుంచుకోండి. దీంతో వేసవిలో వడదెబ్బతోపాటు పలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు. అవేంటో చూద్దాం..

  • ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎండలో ఎక్కువ సేపు ఉండకండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండండి. ప్రత్యక్ష సూర్య కిరణాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • ఎండలో బయటకు వెళ్లినట్లయితే, చర్మంపై సరిగ్గా సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. బలమైన సూర్యకాంతిలో చర్మంతోపాటు వడదెబ్బను నివారించడానికి గొడుగు, టోపీ, తడి టవల్, చల్లటి నీటిని తీసుకెళ్లండి.
  • వేసవిలో బయటి ఆహారాన్ని తినడం మానుకోండి. ముఖ్యంగా ఓపెన్, ఫ్రైడ్ ఫుడ్ తినకూడదు. ఆహార పదార్థాల్లో పరిశుభ్రత పాటించి చేతులు కడుక్కున్న తర్వాత ఆహారం తీసుకోవాలి.
  • ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. నిమ్మకాయ నీరు, పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగాలి. ఎండలో చల్లటి నీరు లేదా ఐస్ వాటర్ అస్సలు తాగకూడదు.
  • వేసవిలో పుచ్చకాయ, కర్జూజ, మామిడి, దోసకాయ, కీర దోసకాయ వంటి సీజనల్ పండ్లను తినడం కొనసాగించండి. ఇది కాకుండా షర్బత్ లేదా సత్తు పానీయాలను తాగడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Viral Video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: లక్ అంటే వీడిదే గురూ..! డ్రైవర్ ధైర్యానికి ఫిదా అవుతున్న నెటిజనం.. షాకింగ్ వీడియో