Facial Exercises: మీ ముఖం మరింత అందంగా కనబడాలంటే.. ఈవ్యాయామాలు మీకోసం..
తాను అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ తాను మరింత అందంగా కనిపించాలని ఎన్నో ఫేసియల్స్ వాడతారు. ఇది తాత్కలిక ఉపశమనాన్ని ఇచ్చినా.. ముఖాకృతిని మరింత అందం చేసేందుకు..
Facial Exercises: తాను అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ తాను మరింత అందంగా కనిపించాలని ఎన్నో ఫేసియల్స్ వాడతారు. ఇది తాత్కలిక ఉపశమనాన్ని ఇచ్చినా.. ముఖాకృతిని మరింత అందం చేసేందుకు ఎటువంటి ఉత్పత్తులు మార్కెట్లో దొరకవు. మన ముఖాకృతిని మరింత అందంగా ఉంచుకునేందుకు ఎవరే సలహా ఇచ్చినా వెంటనే పాటిస్తాం. కొంతమంది ఆరుపదుల వయస్సులోనూ ఎంతో అందంగా కనపడుతుంటారు. అలాంటి వారిని చూసి మనం అలా ఉండాలని కోరుకుంటాం. కాని అదెలా సాధ్యమో తెలీదు. అలా వయస్సు పెరిగినా మన ముఖాకృతి అందంగా కనబడాలంటే దానికి కొన్ని చిట్కాలున్నాయి. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఎన్నో వ్యాయామాలు చేస్తాం. అయితే మన ముఖాకృతి మరింత అందంగా ఉండాలంటే ఎన్నో వ్యాయామాలున్నాయి. శరీర భాగాలకు సంబంధించి ఎన్నో వ్యాయామాలు చేస్తున్నప్పటికి.. ముఖ వ్యాయామాలపై మాత్రం దృష్టి పెట్టరు. తమ ముఖం మరింత అందంగా ఉండాలనుకునే వారికోసమే ఈముఖ వ్యాయామాలు.
శరీరంలో ఉండే వివిధ భాగాల మాదిరిగానే ముఖం, మెడ భాగాల్లో ఉండే కండరాలను ధృడంగా మార్చుకోవడానికి ముఖ వ్యాయామాలు ఉపయోగపడతాయి. సొగసైన ముఖం పొందడానికి, వృద్ధాప్య ఛాయలను ఎదర్కొవడానికి ఈవ్యాయామాలు దోహదపడతాయి. ఈవ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
చీక్ బోన్ లిఫ్ట్: పెద్ద పెద్ద బుగ్గలు కలిగినవారు వారి చెంపల పరిమాణాన్ని తగ్గించుకోవడానికి ఈవ్యాయమం దోహదపడుతుంది. రెండు చేతులను రెండు బుగ్గలపై ఉంచి.. చెంప ఎముక ఉన్నచోట వేళ్లను పెట్టాలి. ఆభాగంలో కండరాలను పైకి అంటే కింది నుంచి కంటివైపు లేపి.. అదిమి పట్టుకోవాలని.. ఇదే సమయంలో ‘O’ ఆకారంలో నోరు తెరిచి ఉంచాలి.. ఇలా 5 సెకన్ల పాటు ఉండాలి. ఈవ్యాయామాన్ని రోజుకు 10 నుంచి 15 సార్లు చేస్తే ముఖాకృతిలో మార్పు కనిపిస్తుంది.
పవర్ ఫిష్ ప్రెస్: పవర్ ఫిష్ చెంపలు గాలితో ఉబ్బినట్లుగా ఉంటాయి. అలాగే ఈవ్యాయామాన్ని చేయాలి. నోటిని పూర్తిగా గాలితో నింపాలి. ఆగాలి బయటకి పోకుండా నోటిలోనే బంధించాలి. ఆగాలిని 10 సెకన్లపాటు ఎడమ చెంపవైపు నెట్టి, మరోసారి కుడి చెంపవైపు నెట్టాలి. ఈప్రక్రియను కనీసం ఐదు నుంచి ఆరు సార్లు చేయాలి. ఈవ్యాయామం ద్వారా ముఖ కండరాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో చెంపలు మరింత బిగుతుగా అవుతాయి. ముఖాకృతి మరింత అందంగా కనబడుతుంది.
జా ఫ్లెక్స్: దవడలు ఎక్కువుగా ఉంటే పెద్ద వయస్సు వారిలా కనిపిస్తుంటారు. ముఖం కూడా పెద్దగా కనిపిస్తుంది. జా ఫ్లెక్స్ వ్యాయమం ద్వారా ముఖం రూపాన్ని కొంతమేర మార్చుకుని నిర్దిష్ట రూపాన్ని పొందవచ్చు. ఈవ్యాయామన్ని చేసేటప్పుడు.. తలను ఇంటి పైకప్పును చూసేలా పైకెత్తి వీలైనంత వెనుకకు వంచాలి. పెదవులను పైకి ముక్కు వరకు జరుపుతూ ఉండాలి. ఇలా చేసేటప్పుడు చెవుల దగ్గర దవడ కండరాలలో ఒత్తిడి కలుగుతుంది. ఇలా 10 సెకన్ల పాటు పట్టుకుని.. ఈవ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది. 10 నుంచి 15 సెట్లను రోజులో పూర్తిచేయాలి.
ఐబ్రో మసాజ్: దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈవ్యాయమం చేయడం వల్ల కనుబొమ్మలు రాలిపోకుండా నివారించవచ్చు. చూపుడు, మధ్య వేలుని కనుబొమ్మలపైన నుదురు భాగంలో ఉంచి.. కనుబొమ్మలను పైకి ఎత్తుతూ ఉండాలి. వేళ్లతో సున్నితంగా నుదుటిపై చర్మాన్ని పైకి కదుపుతూ ఉండాలి. ఈవ్యాయామం చేసేటప్పుడు కళ్లు తెరిచి ఉండేలా చూసుకోవాలి. 30 సెకన్ల పాటు ఈ ప్రక్రియను చేస్తూ.. 6 సెట్లను కనీసం పూర్తిచేస్తే ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం చూడండి..