AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Care: మీరు షుగర్ వ్యాధి బాధితులా.. ఈ సహజ పానీయాలను ఉదయం తాగి చూడండి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర స్థాయిని నియంత్రించడానికి అనేక రకాల డిటాక్స్ పానీయాలను ఆహారంలో చేర్చుకోవచ్చు . మీరు ఈ డిటాక్స్ డ్రింక్స్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

Diabetes Care: మీరు షుగర్ వ్యాధి బాధితులా.. ఈ సహజ పానీయాలను ఉదయం తాగి చూడండి..
Diabetes Care
Surya Kala
|

Updated on: Aug 24, 2022 | 3:05 PM

Share

Diabetes Care: జీవనశైలిలో మార్పులు, తీసుకునే ఆహారం సరైనది కానట్లయితే.. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. మధుమేహంతో బాధపడేవారు తమను తాము ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి. అంతేకాదు శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించగల ఆహారంలో అటువంటి ఆహారాలను చేర్చుకోవడం అవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర స్థాయిని నియంత్రించడానికి అనేక రకాల డిటాక్స్ పానీయాలను ఆహారంలో చేర్చుకోవచ్చు . మీరు ఈ డిటాక్స్ డ్రింక్స్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి మీరు ఏ ఆరోగ్యకరమైన డిటాక్స్ పానీయాలను ఆహారంలో చేర్చుకోవచ్చో  ఈరోజు తెలుసుకుందాం..

తులసి డిటాక్స్ డ్రింక్ తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంది. అంతేకాదు ఈ డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. తులసి డిటాక్స్ డ్రింక్ తయారీకోసం ఒక గ్లాసు నీటిలో 6 నుండి 8 తులసి ఆకులను వేయండి. బాగా వేడి చేయండి. అనంతరం ఆ నీటిని చల్లార్చి తాగండి.

అల్లం డిటాక్స్ పానీయం అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీన్ని తయారు చేయడానికి, ఒక గ్లాసు నీటిలో అల్లం వేయండి. ఆ నీటిని బాగా మరిగించండి. దీని తరువాత ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగండి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మెంతి డిటాక్స్ డ్రింక్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వాటిని ఉడకబెట్టండి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి.. ఆ నీటిని తాగండి.

దాల్చిన చెక్క డిటాక్స్ పానీయం మధుమేహంతో బాధపడే వారికి కూడా దాల్చిన చెక్క చాలా మంచిది. దీని కోసం, 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

వేప డిటాక్స్ పానీయం వేప నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు వరం వంటిది. వేప ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ డిటాక్స్ డ్రింక్ తయారీకి కోసం  ఒక గ్లాసు నీటిలో 7 నుండి 8 వేప ఆకులను వేసి.. ఆ నీటిని మరిగించాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. ఈ నీటి రుచి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తలను ఇక్కడ చదవండి

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)