AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Flu: భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న టమాట ఫ్లూ.. 9 ఏళ్లలోపు వారే అధికం.. లక్షణాలు ఇవే..

Tomato Flu: ప్రపంచాన్ని కొత్త కొత్త వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. కంటికి కనిపించని వైరస్‌లు మానవాళిని అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గుముఖం పట్టకముందే ఇప్పుడు..

Tomato Flu: భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న టమాట ఫ్లూ.. 9 ఏళ్లలోపు వారే అధికం.. లక్షణాలు ఇవే..
Tomato Flu
Narender Vaitla
|

Updated on: Aug 24, 2022 | 3:02 PM

Share

Tomato Flu: ప్రపంచాన్ని కొత్త కొత్త వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. కంటికి కనిపించని వైరస్‌లు మానవాళిని అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి సృష్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గుముఖం పట్టకముందే ఇప్పుడు మరికొన్ని కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. ఆఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. భారత్‌లోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా మరో కొత్త వైరస్‌ సైతం మానవాళిని భయపెట్టిస్తోంది. అదే.. టమాట ఫ్లూ. హ్యాండ్ పూట్‌ మౌత్‌ డిసీజ్‌ పేరుతో పిలిచే ఈ కొత్తరకం వ్యాధి తాజాగా దేశంలో విస్తరిస్తోంది.

కేరళలోని కొల్లాం జిల్లాలో 2022 మే 26న తొలి కేసు నమోదైంది. కేవలం రెండు నెలల్లోనే ఈ సంఖ్య 82కు చేరింది. కేరళలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ తర్వాత తమిళనాడు, ఒడిశా, హర్యానా రాష్ట్రాలకు విస్తరించింది. దీంతో టమాట ఫ్లూ పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆగస్టు 23న అలర్ట్‌ చేసింది. వ్యాధి విస్తరణను అడ్డుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం మార్గనిర్దేశకాలు జారీ చేసింది.

అసలేంటీ టమాట ఫ్లూ..?

టమాట ఫ్లూ అనేది ఒక వైరల్‌ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణం ఎర్రటి రంగులో బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తాయి. ఈ బొబ్బలు పెద్దవిగా మారితే అచ్చంగా టమాటలాగే కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధిని టమాట ఫ్లూ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఈ వ్యాధి 1 – 9 ఏళ్ల చిన్నారుల్లో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోగ నిరోధశక శక్తి తక్కువగా ఉన్న పెద్ద వారికీ ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలిపారు. టమాట ఫ్లూ సోకిన వారిలో ప్రారంభంలో జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మంపై మంటగా అనిపిస్తుంది. అలాగే శరరీరంపై ఎర్రటి మచ్చలు ఏర్పడి అవి క్రమంగా బొబ్బలుగా మారుతాయి. నోటి పొక్కులు, నాలుక, చిగుళ్లు చెంపల లోపలి భాగాలు, అరచేతులు, పాదాల అడుగుభాగాల్లో పొక్కులు ఏర్పడుతాయి. ఈ బొబ్బలు క్రమంగా అల్సర్‌గా మారే అవకాశముంటుందని నిపుణులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే టామట ఫ్లూ వ్యాధి చికిత్సకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక ఔషధం లేదు. ఎలాంటి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. చిన్నారుల్లో ఈ వ్యాధి న్యాపీల ద్వారా, అపరిశుభ్రంగా ఉండే వస్తువులు, ప్రదేశాలను తాకిన చేతులను నోట్లో పెట్టుకోవడంతో టమాట ఫ్లూ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవాలంటే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరం. వైరస్‌ సోకిన పిల్లలను వారి ఆట వస్తువులు, దుస్తులు, ఆహారం, ఇతర వస్తువులను ఇతర పిల్లలతో పంచుకోకుండా చూడాలి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని ఐసోలేషన్‌లో ఉంచాలి. 5 నుంచి 7 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి తగిన విశ్రాంతి ఇవ్వాలి. ఎక్కువగా లిక్విడ్‌ ఫుడ్‌ను అందిస్తుండాలి. వేడి నీటిలో ముంచిన స్పాంజితో శరీరాన్ని తుడిస్తే రాషెస్‌, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగికి వెంటనే పారాసెటమాల్‌ మాత్రలతో పాటు, లక్షణాలను బట్టి వైద్యుల సూచనమేరకు చికిత్స అందించాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..