Health Tips: ఈ అలవాట్లు ఉన్నట్లయితే.. మీ మెదడు డ్యామేజ్ అయినట్లే.. అవేంటంటే!

వయసు పెరుగుతున్న కొద్దీ.. శరీరంలోనే కాదు మెదడులో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణం.

Health Tips: ఈ అలవాట్లు ఉన్నట్లయితే.. మీ మెదడు డ్యామేజ్ అయినట్లే.. అవేంటంటే!
Brain Health
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 24, 2022 | 1:56 PM

వయసు పెరుగుతున్న కొద్దీ.. శరీరంలోనే కాదు మెదడులో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణం. యవ్వనంలో ఉన్నప్పుడు మెదడు చురుగ్గా పని చేస్తే.. 30-40 ఏళ్లు వయసు వచ్చేటప్పుడు దాని పనితీరు తగ్గుతుంది. మతిమరుపు రావడం జరుగుతుంది. అయితే కొన్ని రకాల అలవాట్లు కారణంగా మెదడు పనితీరు సామర్ధ్యం తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం..

ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎప్పుడు నిద్రలేస్తున్నామో.. ఎప్పుడు తింటున్నామో.. ఎవ్వరూ చెప్పలేరు. కొంతమంది అయితే.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తుంటారు. ఇక అలా చేయడం వల్ల శరీరంతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

లేటుగా నిద్రపోవడం..

ఫోన్ల వాడకం ఎక్కువైపోవడంతో చాలామంది తెల్లవార్లూ మెలుకువగా ఉండి మరీ వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూస్తున్నారు. ఇలా చేయడం సరికాదని డాక్టర్లు అంటున్నారు. రాత్రి 10 గంటల కల్లా నిద్రపోతే.. ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అలాగే మనిషికి కనీసం 8 గంటల నిద్ర ఉండాలని వైద్యనిపుణులు అంటుంటే.. చాలామంది కనిష్టంగా 5 గంటల సమయాన్నే నిద్రకు కేటాయిస్తున్నారు. ఇలా లేటుగా, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మెదడు దెబ్బ తినే అవకాశం ఉందట.

చక్కెర ఎక్కువ తిన్నట్లయితే..

స్వీట్లు చాలామందికి ఇష్టం. అయితే చక్కెర ఎక్కువగా ఉండే పదార్ధాలు తింటే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందట. అటు చక్కెర మోతాదు మించితే రక్తంలో షూగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందుకే చక్కెర పదార్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మొబైల్ వాడకం..

ఎక్కువసేపు మొబైల్ వాడితే.. దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెడు అలవాటును వెంటనే మానుకోవాలని అంటున్నారు. అవసరమైతేనే ఫోన్ వాడాలని సూచిస్తున్నారు.

మద్యం సేవించడం..

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. ఈ బోర్డు ప్రతీ చోట చూస్తుంటాం. అయినా కొందరు ఆల్కహాల్ సేవిస్తారు. ఇలా మద్యం సేవించడం వల్ల మెదడుకు రక్తసరఫరా సరిగ్గా జరగదని వైద్యులు అంటున్నారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ