AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bilwa Leaves: ఈ ఆకు తింటే టోట‌ల్ బాడీ డిటాక్స్.. ఇంకా ఎన్నో

బిల్వ పత్రంలో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకును మారేడు ఆకు అంటారు. దీనితో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే గుణం ఈ బిల్వపత్రంలో ఉందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము.

Bilwa Leaves: ఈ ఆకు తింటే టోట‌ల్ బాడీ డిటాక్స్.. ఇంకా ఎన్నో
Bilwa
Ram Naramaneni
|

Updated on: Feb 24, 2024 | 4:52 PM

Share

బిల్వ (మారేడు)కు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మారేడు చెట్టు అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి.  ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.  ఆకులే కాదు.. కాయలు, పూలు, కాండం, వేర్లు కూడా మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.   మారేడులో మినరల్స్‌, విటమిన్లు సూపర్‌గా ఉంటాయి. అలాగే విటమిన్‌ బి, సి, కాల్షియం, కెరోటిన్‌,  ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఈ చెట్టు ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  • మలబద్ధకం, విరేచనాలు, ఆయాసం  జలుబు  లాంటి సమస్యల నివారణకు బిల్వ ఫలం బాగా సాయపడుతుంది.
  • ఆకులను పొడి చేసి రోజూ కొంచెం తీసుకుంటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది
  • గర్భిణులకు వచ్చే ఒళ్లు నొప్పులు తగ్గాలంటే.. మారేడు ఆకులను వేడినీటిలో వేసి స్నానం చేయాలి.
  • ఆకుల పొడి తీసుకుంటే  కొలెస్ట్రాల్‌ను తగ్గుతుంది
  •  ఫైల్స్‌ సమస్య ఉన్నవారు మెంతిపొడితో కలిపి తీసుకుంటే ఉపయోగం ఉంటుంది
  • వేర్లను చూర్ణం చేసి.. హాఫ్ టీ స్పూన్ చొప్పున కషాయంగా చేసి తీసుకుంటే దగ్గు, జ్వరం తగ్గుంమది. అలాగే అనేక రోగాలకు దివ్యౌషధంగా చెబుతారు.
  • అధిక వేడితో బాధ ప‌డే వారికి మారేడు ఆకులు గొప్ప ఔష‌ధంగా ప‌ని చేస్తాయి.
  • దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే కడుపులోని నులి పురుగులు కూడా నాశ‌నం అవుతాయి.
  •  అనేక వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
  • బిల్వలో వుండే ఇనుము రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది.
  • మారేడు ఆకు గుండె- కాలేయ వ్యాధులకు వ్యతిరేకంగా శక్తివంతంగా పనిచేస్తుంది.
  • బిల్వ పత్రంలో పొటాషియం దండిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)