AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: టీలో పంచదార వేయకుండా.. ఇలా ట్రై చేయండి.. సూపర్ బెనిఫిట్స్

అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టీలో బెల్లం ఏంటని అనుకోకండి పంచదారకు బెల్లం వేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లాన్ని తీసుకుంటే అనారోగ్యానికి తక్కువ గురవుతారని నిపుణులు అంటున్నారు....

Health: టీలో పంచదార వేయకుండా.. ఇలా ట్రై చేయండి.. సూపర్ బెనిఫిట్స్
Jaggery Tea
Ram Naramaneni
|

Updated on: Feb 24, 2024 | 6:49 PM

Share

మనలో దాదాపు ప్రతీ ఒక్కరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరికైతే టీ తాగనిదే రోజు గడవని పరిస్థితి ఉంటుంది. జీవితంలో టీ ఒక భాగంగా మారిన వారు మనలో చాలా మందే ఉంటారు. అయితే టీలో కచ్చితంగా చక్కెర వేసుకోవాల్సిందే. మరి చక్కెర ఎక్కువగా తీసుకుంటే శరీరానికి ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చక్కెర ప్రధాన కారణం.

అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టీలో బెల్లం ఏంటని అనుకోకండి పంచదారకు బెల్లం వేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లాన్ని తీసుకుంటే అనారోగ్యానికి తక్కువ గురవుతారని నిపుణులు అంటున్నారు. ఇంతకీ టీలో చక్కెరకు బదులు బెల్లాన్ని వేసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* బెల్లం ఐరన్‌కు పెట్టింది పేరు. అందుకే బెల్లం టీ తాగడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. కాబట్టి తక్కువ రక్తం సమస్యతో బాధపడుతున్న వారు బెల్లాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* బెల్లాన్ని టీలో కలుపుకొని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలో ఉండే క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు జలుబు, దగ్గు, జ్వరం వంటివి దూరమవుతాయి.

* బెల్లం టీని నిత్యం తీసుకోవడం వల్ల జీవక్రియలు మెరుగువుతాయి. జీవక్రియలను వేగవంతం చేయడం వల్ల బరువు త్వరగా తగ్గేలా చేస్తుంది.

* ఇక స్త్రీలకు బెల్లం దివ్యౌషధంగా చెప్పొచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే చాలా సమస్యలకు బెల్లం టీ మంచి పరిష్కారంగా చెప్పాలి. కడుపునొప్పి రావడం, తిమ్మిర్లు పట్టడం వంటివి అదుపులో ఉంటాయి.

* శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో బెల్లం టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ క్రమంతప్పకుండా బెల్లం టీ తాగితే పొట్ట, పేగులు, ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. ఈ టీ తాగే వారిలో మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. ఇది జీర్ణక్రియకు మంచిది.

* అజీర్తి వంటి జీర్ణ క్రియ సమస్యలకు కూడా బెల్లంటీతో చెక్‌ పెట్టొచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శారీరక సమస్యలనే కాకుండా, మానసిక సమస్యలను దరి చేరనివ్వదు.

* గర్భిణీలకు కూడా బెల్లం టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ ఉదయం ఈ టీని తాగితే తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు మేలు జరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే