AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: వీటిని మితంగా తింటే చాలు.. నవయవ్వనమైన ముఖం మీ సొంతం..

ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ వివిధ రకాల పనులతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అశ్రద్ద వహిస్తారు. వీటిని నిత్యం మనం తినే ఆహార పదార్థాల్లో ఉండేల చూసుకుంటే అందం, ఆరోగ్యం పెరగడం ఖాయం అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ముఖాన్ని నవ యవ్వనంగా ఉంచేందుకు దోహదపడే ఐదు ముఖ్యమైన పదార్థాలను ఇప్పడు చూద్దాం.

Srikar T
|

Updated on: Feb 24, 2024 | 9:12 PM

Share
బాదం, కాజు, పిస్తా, ఆప్రికాట్, వాల్‎నట్స్ లాంటి డ్రైఫ్రూట్స్ తినడం ద్వారా అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఆరోగ్యంగానే కాదు.. అందంగానూ తయారవ్వచ్చు. అయితే వీటిని మరీ ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పెరిగి లావుగా మారే అవకాశం ఉంటుంది.

1 / 5
ఆలివ్‌ ఆయిల్‌ అందానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న పాలీఫినాల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశ్యాచురేటెడ్‌ కొవ్వుల వల్ల వయసు మీద పడుతున్న ఛాయలు దగ్గరకి రావు. అందుకే వంటల్లో ఆలివ్‌నూనెను కూడా చేర్చుకోవాలి. అలాగే అప్పుడప్పుడు ఆలివ్‌ నూనెతో చర్మాన్ని మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మెరిసిపోయే చర్మం మీసొంతం.

2 / 5
సూర్యరశ్మి, అతినీలలోహిత కిరణాల ప్రభావం వల్ల కూడా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతుంది. కొకోవా బీన్స్‌తో తయారు చేసిన డార్క్‌ చాక్లెట్‌ ఈ సమస్యను తగ్గిస్తుంది. దీనిలో లభించే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తాయి. అలాగే చర్మంలో తేమ కోల్పోకుండా చేస్తాయి. అందుకే చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

3 / 5
ఉసిరిలో విటమిన్‌ ‘సి’ అధికంగా లభిస్తుంది. అలాగే చర్మపోషణకు అవసరమైన ఖనిజ పదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని పోషకాలు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల చర్మానికి సరైన పోషణ అందుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది. ఉసిరిని తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.

4 / 5
జలం జీవనాధారం అంటారు. మనం రోజూ సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. తద్వారా చర్మానికి కావాల్సిన తేమ కూడా అందుతుంది. దీంతో పొడిబారకుండా ఉండి చర్మం తేమ సరిపడా అందడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి.

5 / 5