Guava: ఈ ఆకులు 100 మెడిసిన్స్‌తో సమానం.. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో..
జామ ఆకులతో చేసిన టీ తాగితే బరువు తగ్గొచ్చు. జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను తరిమికొట్టవచ్చు. గుప్పెడు జామ ఆకుల్ని 20 నిమిషాలు నీళ్లలో ఉడికించాలి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఆ నీళ్లలో గోరింటాకు, మందారాకు ముద్దను కాసేపు నానబెట్టాలి. దీన్ని తలకు రాసుకొని, కొంతసేపయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలే సమస్యను అదుపు చేయవచ్చు.

Guava Leaves
పచ్చగా నవనవలాడే.. జామ కాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జామ పండ్లను పేదోడి యాపిల్ అంటారు. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అలానే జామ ఆకులు కూడా మనకు మస్త్ ఉపయోగపడతాయి. పొటాషియం, సల్ఫర్, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి జామ ఆకుల్లో ఉంటాయి. జామ ఆకుల వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- జామ ఆకుల్లో క్యాన్సర్ వ్యతిరేక గుణాలు ఉంటాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు మనకు వ్యాధులు రాకుండా రక్షణనిస్తాయి.
- కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియని జామ ఆకులు అడ్డుకుంటాయి. దీంతో షుగర్‌కు చెక్ పెట్టవచ్చు.
- జామఆకులతో చేసిన టీని తాగడం వల్ల బరువు తగ్గుతారు.
- చిన్నపాటి గాయాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో జామఆకులని రుద్ది చూడండి. ఉపశమనం ఉంటుంది.
- జామ ఆకుల వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది.
- జామ ఆకును జీర్ణ సంబంధ వ్యాధి చికిత్సకు వాడుతారు.
- గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధి , పంటి నొప్పి, నోటి పుండ్ల కోసం తాజా జామ ఆకులని వాడుతుంటారు.
- జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సహా విటమిన్ సి లక్షణాలు ఉంటాయి.
- జామ ఆకుల్లో రక్తాన్ని శుద్ధి చేసే చేసే గుణాలు ఉన్నాయి.
- అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.
- ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
- ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
