విటమిన్-C ఎక్కువగా తీసుకుంటున్నారా! అయితే జాగ్రత్త..! ఎంత సరిపోతుందో తెలుసా..!

Vitamin C Effect: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ‘రోగ నిరోధక శక్తి’ని పెంచుకోడానికి ఎక్కువ "విటమిన్ సి" తీసుకుంటున్నారు. కానీ "విటమిన్ సి" అధికంగా వాడటం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు.

విటమిన్-C ఎక్కువగా తీసుకుంటున్నారా! అయితే జాగ్రత్త..! ఎంత సరిపోతుందో తెలుసా..!
Vitamin C
Follow us
Sanjay Kasula

|

Updated on: May 19, 2021 | 8:19 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరికీ ‘రోగ నిరోధక శక్తి’పై శ్రద్ధ పెరిగింది. ఇది కొంత వరకు మంచిదే. కానీ, అతి జాగ్రత్త కూడా ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కోసారి శరీరానికి మంచి చేసే ఆహారమే.. కీడు కూడా చేసే అవకాశం ఉంది. అందుకే.. మనం ఏం తీసుకున్నా.. ‘సమతుల్యం’ తప్పకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా విటమిన్ సి (vitamin c) మరియు జింక్ మాత్రలు మొదలైనవి తీసుకుంటారు. ఇందులో కూడా విటమిన్ సి తీసుకోవటానికి గరిష్ట ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

కానీ విటమిన్ సి నీటిలో కరుగుతుంది. శరీరం దానిని నిల్వ చేసుకోలేదు. కాబట్టి దానిని తగినంత స్థాయిలో సప్లిమెంట్స్ గా తీసుకోవాలి. అది కూడా  డైట్ ద్వారా తీసుకోవాలి. కానీ ఈ సందర్భంలో విటమిన్ సి అధికంగా వాడటం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం  ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడానికి బదులుగా…  సమస్యలను కొని తెచ్చుకోవద్దు. ఎక్కువ విటమిన్ సి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ఓసారి తెలుసుకుందాం.

శరీరానికి “విటమిన్ సి” ఎంత అవసరం

నిపుణుల అభిప్రాయం ప్రకారం  రోజూ 65 నుంచి 90 మీ.గ్రా.ల విటమిన్-సి తీసుకుంటే సరిపోతుంది. కాని మనం 1000 మి.గ్రా కంటే ఎక్కువగా విటమిన్ సి  తీసుకుంటే అది మన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. సాధారణంగా మహిళలు విటమిన్ సి 75 మి.గ్రా, పురుషులకు 90 మి.గ్రా, గర్భిణీ స్త్రీలకు 85 మి.గ్రా, పాలిచ్చే మహిళలకు 120 మి.గ్రా సరిపోతుంది.

అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి…

ఏదైనా తక్కువగా తీసుకోవడం, అధికంగా తీసుకోవడం రెండూ హానికరమే. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, ఛాతీలో మంట, తలనొప్పి, నిద్రలేమి వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.

విటమిన్ సి ఎందుకు ముఖ్యం

విటమిన్ సి ఒక యాంటీఆక్సిడెంట్‌ ఇది బంధన కణజాలాలను మెరుగుపరుస్తుంది. కీళ్ళకు సపోర్ట్‌గా పనిచేస్తుంది. అదనంగా శరీరంలో కొల్లాజెన్, ఎల్-కార్నిటైన్ మరియు కొన్ని న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అయితే తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడంలో.., టీబీ(TB) చికిత్సలో విటమిన్ సి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

విటమిన్ సి ఎలా లభిస్తుంది..

విటమిన్ సి… నారింజ, కివి, ఆకుపచ్చ మిరపకాయ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, బచ్చలికూర, బొప్పాయి, పైనాపిల్, నిమ్మ మరియు మామిడి మొదలైన వాటిలో పుష్కలంగా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి : కేవలం 70 నిమిషాల్లో సెంచరీ… క్రికెట్ చరిత్రలో విధ్వంసక ఆటగాడు.. వీరేందర్ సెహ్వాగ్, క్రిస్ గేల్ కంటే ముందు వరసలో..

CM KCR Gandhi Hospital Visit: కరోనా బాధితులకు ముఖ్యమంత్రి భరోసా.. గాంధీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ పర్యటన